Harbhajan Singh : క్రికెటర్ హర్భజన్‌సింగ్ హీరోగా నటిస్తోన్న తొలి చిత్రం ‘ఫ్రెండ్‌షిప్’. ఈ చిత్రంలో తమిళ బిగ్‌బాస్ ఫేమ్ లోస్లియా మరియనేసన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇందులో ‘యాక్షన్ కింగ్’ అర్జున్, సతీష్ ప్రధాన పాత్రధారులు. దర్శక ద్వయం జాన్‌పాల్ రాజ్, శ్యామ్ సూర్య దర్శకత్వంలో ఈ సినిమాను జేపీఆర్, స్టాలిన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో హర్భజన్ ఇంజనీరింగ్ స్టూడెంట్‌గా కనిపిస్తారని సమాచారం.
ఈ సినిమాను అదే పేరుతో శ్రీలక్ష్మీ జ్యోతి క్రియేషన్స్ పతాకంపై నిర్మాత ఏ.ఎన్. బాలాజీ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈసందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ‘ఇంజినీరింగ్ కాలేజీ బ్యాక్‌డ్రాప్‌లో సాగే చిత్రమిది. ప్రేమ, స్నేహం అంశాల సమాహారంగా తెరకెక్కిస్తున్నాం. టైటిల్‌కు ‘సింగ్ అండ్ కింగ్’ అనే క్యాప్షన్‌ను జోడించాం. చిత్రీకరణ తుదిదశకు చేరుకుందని అన్నారు. తెలుగు, తమిళ్, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో విడుదల కానున్న ఈ సినిమాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: వేల్‌మురుగన్, రాబిన్.
మరిన్ని ఇక్కడ చదవండి :
హీరో అడుగు పెట్టనున్న మరో బడా ప్రొడ్యూసర్ కొడుకు..సైలెంట్ గా షూటింగ్ కూడా మొదలుపెట్టేశారా..?