Hanuman Twitter Review: ‘హనుమాన్’ ట్విట్టర్ రివ్యూ.. అదిరిపోయింది.. ఆ 20 నిమిషాలు గూస్ బంప్స్ అంతే..

|

Jan 11, 2024 | 8:27 PM

మరికొన్ని గంటల్లో ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అయితే ఈ సినిమాకు ప్రీమియర్ షోస్ వేశారు మేకర్స్. ఇప్పటికే హిందీలో ప్రీమియర్స్ చూసిన అడియన్స్ సినిమా అదిరిపోయిందంటూ కామెంట్స్ చేశారు. ఫెంటాస్టిక్.. అద్భుతమంటూ టీంపై ప్రశంసల వర్షం కురిపించారు. ఇక ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హనుమాన్ ప్రీమియర్స్ చూసిన ప్రేక్షకుల నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తుంది. ఇప్పటికే ఈ సినిమా చూసిన అడియన్స్ ట్విట్టర్ వేదికగా తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.

Hanuman Twitter Review: హనుమాన్ ట్విట్టర్ రివ్యూ.. అదిరిపోయింది.. ఆ 20 నిమిషాలు గూస్ బంప్స్ అంతే..
Hanuman Movie twitter Review
Follow us on

ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం ఒకే సినిమా గురించి మాట్లాడుతుంది.. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కావాల్సిన మూవీ.. ఒక్క రోజు ముందే ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చేసింది. దీంతో ఇప్పుడు విడుదలకు ముందే బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోన్న సినిమా హనుమాన్. జస్ట్ టీజర్‏తోనే సినిమా ఎలా ఉండబోతుందో హింట్ ఇచ్చేశాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.. విజువల్స్, బ్యాగ్రౌండ్ మ్యూజిక్‏తో ప్రేక్షకులకు మరో ప్రపంచాన్ని పరిచయం చేశాడు. దీంతో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో పెరిగిపోయాయి. జాంబీ రెడ్డి వంటి సూపర్ హిట్ తర్వాత ప్రశాంత్ వర్మ, తేజ సజ్జా కాంబోలో వస్తున్న ఈ సినిమా ఇప్పటికే అడ్వాన్స్ ప్రీమియర్ బుకింగ్స్ లో రికార్డ్స్ క్రియేట్ చేసింది. మరికొన్ని గంటల్లో ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అయితే ఈ సినిమాకు ప్రీమియర్ షోస్ వేశారు మేకర్స్. ఇప్పటికే హిందీలో ప్రీమియర్స్ చూసిన అడియన్స్ సినిమా అదిరిపోయిందంటూ కామెంట్స్ చేశారు. ఫెంటాస్టిక్.. అద్భుతమంటూ టీంపై ప్రశంసల వర్షం కురిపించారు. ఇక ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హనుమాన్ ప్రీమియర్స్ చూసిన ప్రేక్షకుల నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తుంది. ఇప్పటికే ఈ సినిమా చూసిన అడియన్స్ ట్విట్టర్ వేదికగా తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.

ఫస్ట్ హాఫ్ ఎక్స్‏ట్రాఆర్డీనరి అని.. మ్యాడ్ లెవల్ సినిమాటిక్ ఎక్స్ పిరియన్స్ .. ఎక్స్‏ట్రాఆర్డీనరి విజువల్స్.. బ్యాగ్రౌండ్ మ్యూజిక్.. ఇక టైటిల్ కార్డ్ సీన్ గూస్ బంప్స్ అంటున్నారు. సినిమాలోని చివరి 20 సినిమాలు మాత్రం గూస్ బంప్స్ పక్కా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక తేజ పర్ఫామెన్స్ అదరగొట్టేశాడని.. యాక్షన్ అండ్ కామెడీ చాలా బాగుందని అంటున్నారు. డైలాగ్స్, యాక్షన్, బీజీఎమ్ అదిరిపోయాని.. సినిమాకు ప్రధాన బలం తేజ యాక్టింగ్ అంటున్నారు. ఇప్పటికే సినిమా చూసి తమ అభిప్రాయాలను తెలియజేస్తున్న అడియన్స్ చెబుతున్న విషయాలను స్వయంగా మీరే చేసేయ్యండి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.