Hansika Motwani: ప్రియుడితో కలిసి హాన్సిక రొమాంటిక్ పిక్ లీక్.. ఫేక్ అకౌంట్ అంటూ అసలు విషయం బయటపెట్టిన హీరోయిన్..

రాజస్థాన్ జైపూర్ లోని ఓ రాజకోటలో డిసెంబర్ 4న వీరి వివాహం కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో అంగరంగా వైభవంగా జరగనున్నట్లు తెలుస్తోంది. అయితే తాజాగా హాన్సిక తన ప్రియుడితో కలిసి బోట్ షికార్ చేస్తున్న ఫోటో ఇప్పుడు నెట్టింట వైరలవుతుంది.

Hansika Motwani: ప్రియుడితో కలిసి హాన్సిక రొమాంటిక్ పిక్ లీక్.. ఫేక్ అకౌంట్ అంటూ అసలు విషయం బయటపెట్టిన హీరోయిన్..
Hansika

Updated on: Nov 05, 2022 | 8:40 AM

తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు హాన్సిక మోత్వాని. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన దేశముదురు సినిమాతో వెండితెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకుంటూ అగ్రకథానాయికగా స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. అయితే అందం, టాలెంట్ ఉన్నప్పటికీ ప్రస్తుతం ఈ అమ్మడకు అనుకున్నంతగా అవకాశాలు రావడం లేదు. అటు తెలుగులోనే కాకుండా హిందీలోనూ పలు చిత్రాల్లో నటించి మెప్పించింది ఈ బ్యూటీ. అయితే తాను డిసెంబర్ లో ఏడడుగుల బంధంలోకి అడుగుపెట్టనున్నట్లు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించిన హాన్సిక.. రెండ్రోజుల క్రితం తన కాబోయే భర్త ఫోటోస్ షేర్ చేసింది. తన బిజినెస్ పార్టనర్ సోహైల్ ఇకపై జీవిత భాగస్వామి కాబోతున్నట్లుగా సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది హాన్సిక.

రాజస్థాన్ జైపూర్ లోని ఓ రాజకోటలో డిసెంబర్ 4న వీరి వివాహం కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో అంగరంగా వైభవంగా జరగనున్నట్లు తెలుస్తోంది. అయితే తాజాగా హాన్సిక తన ప్రియుడితో కలిసి బోట్ షికార్ చేస్తున్న ఫోటో ఇప్పుడు నెట్టింట వైరలవుతుంది. అందులో అతనితో సరదాగా నవ్వులు చిందిస్తూ కనిపిస్తుంది. అయితే తన ఫోటో చూసిన హాన్సిక అది ఫేక్ అకౌంట్ అంటూ కామెంట్ చేసింది. ప్రస్తుతం ఆమె చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

ఇవి కూడా చదవండి

Hansika Motwani

తన స్నేహితుడు.. బిజినెస్ పార్టనర్ సోహైల్‏తో హాన్సిక కొంతకాలంగా ప్రేమలో ఉంది. ఇటీవలే ఈ జంట నిశ్చితార్థం కూడా జరిగినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె పార్ట్నర్ , 105ల మినట్స్ చిత్రాల్లో నటిస్తోంది. ఇప్పటికే ఈ రెండు సినిమాలు షూటింగ్ కంప్లీట్ కాగా.. తెలుగులో మై నేమ్ ఈజ్ శ్రుతి, తమిళంలో నాలుగు సినిమాలు ఉన్నాయి.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us