
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ అవైటెడ్ చిత్రం గుంటూరు కారం. సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రానికి త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తుండగా.. మీనాక్షి చౌదరీ, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. ముందుగా ఈ మూవీలో కథానాయికగా పూజా హెగ్డేను తీసుకున్నారు. కానీ అనుహ్యంగా బుట్టబొమ్మ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో మీనాక్షిని తీసుకున్నారు. చాలా కాలంగా ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ సినిమాపై మరింత ఆసక్తిని క్రియేట్ చేశాయి. ఇందులో రమ్యకృష్ణ, జగపతి బాబు, ప్రకాష్ రాజ్, సునీల్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమాలో మహేష్ మాస్ యాక్షన్ హీరోగా కనిపించనుండడంతో గుంటూరు కారం సినిమా చూసేందుకు అడియన్స్ వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ మూవీ అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.
అయితే ఈ సినిమా గురించి ఇప్పుడు ఓ ఆసక్తికర విషయం నెట్టింట వైరలవుతుంది. అదేంటంటే.. గుంటూరు కారం చిత్రంలోని ఫస్ట్ సాంగ్ ను నవంబర్ మొదటి వారంలో రిలీజ్ చేయనున్నట్లు నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఓ మీడియా ప్రెస్ మీట్ లో ప్రకటించారు. అయితే తాజాగా వినిపిస్తోన్న సమాచారం ప్రకారం ఈ సినిమా మొదటి పాటను డైరెక్టర్ త్రివిక్రమ్ బర్త్ డే సందర్భంగా అంటే నవంబర్ 7న రిలీజ్ చేయనున్నారని తెలుస్తోంది. అలాగే అతి త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన ఇవ్వనున్నారని తెలుస్తోంది.
When 𝙋𝙧𝙚𝙘𝙞𝙨𝙞𝙤𝙣 meets 𝙋𝙚𝙧𝙛𝙚𝙘𝙩𝙞𝙤𝙣, it will be a CRACKER at the BOX OFFICE 💣💥
With immense pride, we bring you the HIGHLY INFLAMMABLE COMBO of Reigning Superstar @urstrulymahesh & Wizard of Words #Trivikram‘s #GunturKaaram in the USA 🤩🌶️
Never before kind of… pic.twitter.com/JeetkYVPSH
— Prathyangira Cinemas (@PrathyangiraUS) October 24, 2023
హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది 2024 జనవరి 12న సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు. ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందిస్తున్నారు. గుంటూరు కారం విడుదలకు ఇంకా రెండు నెలల సమయం మాత్రమే ఉంది. ఆలోపు నాలుగు సింగిల్స్ విజడుదల కావాలని.. ఇక నుంచి సినిమా ప్రమోషనల్లో వేగం పెంచుతామని నిర్మాత తెలిపారు. అలాగే ముందు ప్రకటించినట్లుగానే ఈ సంక్రాంతికే గుంటూరు కారం చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు తెలిపారు.
The Highly Inflammable SUPER🌟 @urstrulyMahesh 🔥🌶#GunturKaaram pic.twitter.com/puUNFQ7wiE
— Haarika & Hassine Creations (@haarikahassine) October 23, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.