ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. దీనికి తోడు ఆదివారం పండగ రావడంతో కుటుంబ సభ్యులతో కలిసి ఎంతో సంతోషంగా ఈ పర్వదినాన్ని జరుపుకున్నారు. మన దేశంలోనూ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. అలాగే పలువురు సినీ తారలు క్రిస్మస్ వేడుకలను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. కొందరు కుటుంబ సభ్యులతో కలిసి పండగను జరపపుకుంటే మరికొందరు స్నేహితులు, సన్నిహితులతో కలిసి సందడి చేశారు. ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొనడంతో పాటు కేక్ కటింగ్ కార్యక్రమాల్లోనూ హుషారుగా పాల్గొన్నారు. అనంతరం తమ సెలబ్రేషన్స్‌కు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. తమ అభిమానులకు క్రిస్మస్ పండగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలయ్యాయి. పై ఫొటో కూడా అలాంటిదే. ఇందులో ఉన్నది ఓ ప్రముఖ హీరోయిన్. తన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో కవ్వించే ఈ భామకు టాలీవుడ్‌లోనూ బోలెడు క్రేజ్ ఉంది. ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే. బాలనటిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ సొగసరి ఆ తర్వాత హీరోయిన్‌గా పాపులారిటీ తెచ్చుకుంది. చేసింది కొన్ని సినిమాలైనా గుర్తుండిపోయే పాత్రలు చేసింది. ఎక్కువగా తమిళ్, మలయాళ సినిమాలే చేసినప్పటికీ తెలుగులోనూ ఈ బ్యూటీ క్వీన్‌కు అశేష అభిమానగణం ఉంది. ఇటీవలే మొదటిసారి నేరుగా తెలుగు సినిమాలో నటించి మెప్పించిన ఈ ఎక్స్‌ప్రెషన్ ఎవరో గుర్తుపట్టారా మరి?
ఈమె మరెవరో కాదు అంటే సుందరానికి హీరోయిన్ నజ్రియా నజీమ్. క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ఈ సొగసరి ఆ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసింది. ఇందులో తన పెట్‌డాగ్‌తో కలిసి పోజులిచ్చిందీ క్యూటీ. ఈ ఫొటోలు అభిమానులను తెగ ఆకట్టుకుంటున్నాయి. కాగా ఇటీవలే న్యాచురల్ స్టార్ నానితో కలిసి అంటే సుందరానికి సినిమాలో నటించింది నజ్రియా. తెలుగులో ఆమెకు ఇదే మొదటి సినిమా. ఈ సినిమాలో నజ్రియా అభినయానికి మంచి మార్కులు పడ్డాయి. సినిమా కూడా మంచి విజయం సాధించింది. ఈ మూవీ ఇచ్చిన ఉత్సాహంతో నజ్రియా మరిన్ని తెలుగు సినిమాలు చేస్తుందని ఆమె అభిమానులు భావిస్తున్నారు. అయితే ఇప్పటివరకు మరో సినిమాకు సైన్ చేయలేదీ సొగసరి. అయితే ఆమె భర్త ఫాహద్ ఫాజిల్ మాత్రం దక్షిణాది ఇండస్ట్రీలో దూసుకెళుతున్నాడు. పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు తెచ్చుకున్న ఆయన పుష్ప సీక్వెల్‌లోనూ నటిస్తున్నాడు. మొదటి పార్ట్ కంటే మరింత పవర్‌ఫుల్ రోల్‌లో ఆయన కనిపిస్తున్నట్లు టాక్ నడుస్తోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..