Tollywood : అప్పుడు టీవీ యాంకర్.. ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్.. 40 ఏళ్ల వయసులోనూ తగ్గని క్రేజ్..

ప్రస్తుతం సోషల్ మీడియాలో సినీతారలకు సంబంధించిన పలు విషయాలు క్షణాల్లో వైరలవుతున్నాయి. అలాగే కొన్ని రోజులుగా నెట్టింట తారల త్రోబ్యాక్ ఫోటోస్ ట్రెండ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ హీరోయిన్ లేటేస్ట్ పిక్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఒకప్పుడు టీవీ యాంకర్.. ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్. ఇంతకీ ఆమె ఎవరంటే.

Tollywood : అప్పుడు టీవీ యాంకర్.. ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్.. 40 ఏళ్ల వయసులోనూ తగ్గని క్రేజ్..
Nayanthara

Updated on: Mar 17, 2026 | 10:06 AM

పైన ఫోటోలో కనిపిస్తున్న హీరోయిన్ ఎవరో తెలుసా..? ప్రస్తుతం ఆమె పాన్ ఇండియా మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. తెలుగు, తమిళం, హిందీ భాషలలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్, బాలకృష్ణ, రజినీకాంత్ వంటి స్టార్ హీరోల నుంచి ప్రభాస్, ఎన్టీఆర్, సూర్య హీరోలతో అనేక బ్లాక్ బస్టర్ హిట్స్ నటించింది. తక్కువ సమయంలోనే తనదైన ముద్ర వేసిన ఆమె.. దాదాపు 20 ఏళ్లుగా చక్రం తిప్పుతుంది. ప్రస్తుతం ఆమె వయసు 41 సంవత్సరాలు. ఇప్పటికీ ఏమాత్రం తరగని అందం.. అభినయంతో ప్రేక్షకుల హృదయాలు దోచుకుంటుంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి.

ఎక్కువమంది చదివినవి : Jabardasth Naresh: నెలకు 13 ఈవెంట్స్ చేస్తా.. ఒక్కో ఈవెంట్‏కు ఎంత తీసుకుంటానంటే.. జబర్దస్త్ నరేష్..

ఆమె మరెవరో కాదు. లేడీ సూపర్ స్టార్ నయనతార. ప్రస్తుతం పాన్ ఇండియా మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. దక్షిణాది చిత్రపరిశ్రమలో అగ్రకథానాయిక. సినిమాల్లోకి రాకముందు ఆమె టీవీ యాంకర్. బుల్లితెరపై పలు కార్యక్రమాలకు హోస్టింగ్ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తన అసలు పేరుతో చామయం అనే ఫ్యాషన్, లైఫ్ స్టైల్ షోను నిర్వహించింది. ఆమె అసలు పేరు డయానా మరియం కురియన్. మనసునక్కరే సినిమాతో మలయాళం సినీరంగంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత తెలుగు, తమిళం భాషలలో అనేక హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది.

ఎక్కువమంది చదివినవి : Tollywood : ఎంతో కష్టపడి కట్టుకున్న ఇల్లును సుడిగాలి సుధీర్‏కు అమ్మేశా.. టాలీవుడ్ నటుడు..

ఇటీవల మెగాస్టార్ చిరంజీవి జోడిగా మన శంకర వరప్రసాద్ గారు సినిమాలో నటించింది. డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ మూవీ సంక్రాంతి కానుకగా విడుదలై ఏకంగా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. కెరీర్ మంచి ఫాంలో ఉన్నప్పుడే డైరెక్టర్ విఘ్నేష్ శివన్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి సరోగసీ ద్వారా ఉయిర్, ఉలాగ్ అనే ఇద్దరు కవల అబ్బాయిలు జన్మించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె వయసు 41 సంవత్సరాలు. ఇప్పటికీ ఏమాత్రం తగ్గని క్రేజ్ తో దూసుకుపోతుంది.

ఎక్కువమంది చదివినవి : Tollywood : ఆమెకు 15.. అతడికి 24.. పదేళ్లుగా సీక్రెట్ లవ్.. కట్ చేస్తే.. భార్యభర్తలుగా ఒక్కటైన హీరోహీరోయిన్..

ఎక్కువమంది చదివినవి : Appa Rao: ఆ సినిమా సమయంలో చేసిన పని.. నా ఫేస్ మొత్తం బ్లాక్ అయ్యింది.. జబర్దస్త్ అప్పారావు..

Follow Us