
గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో స్టార్ హీరోస్ చిన్ననాటి ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి. టాలీవుడ్ మాత్రమే కాదు.. బాలీవుడ్ తారల పిక్స్ కూడా హల్చల్ చేస్తున్నాయి. ఈ ఫోటోలకు నెటిజన్ రియాక్షన్స్ ఎక్కువగానే వస్తుంటాయి. తాజాగా ఓ స్టార్ హీరో చిన్ననాటి బ్యూటిఫుల్ పిక్ ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతుంది. పైన ఫోటోను చూశారు కదా.. అమాయకంగా చిరునవ్వులు చిందిస్తున్న ఈ చిన్నారి టాలీవుడ్ లవర్ బాయ్. ప్రేమకథ చిత్రాలకు అతనే రాజకుమారుడు. ఎన్నో అందమైన ప్రేమ కథలతో తెలుగు ప్రేక్షకులను అలరించారు. అంతేకాకుండా.. ఈ హీరోకు అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువగానే ఉంటుంది. బాలనటుడిగా కెరీర్ ఆరంభించి.. ఆ తర్వాత హీరోగా గుర్తింపు సంపాదించుకున్నారు. వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటూ స్టార్ డమ్ సంపాదించుకున్నారు. కానీ అనుకోకుండానే ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఇందుకు కారణం కూడా ఉంది. వరుస హిట్స్ అందుకుని కెరీర్ మంచి ఫాంలో ఉన్న సమయంలోనే స్టోరీ ఎంపికలో చేసిన చిన్న చిన్న పొరపాట్లతో ప్లాపులు ఖాతాలో వేసుకున్నారు. దీంతో అతడి క్రేజ్ నెమ్మదిగా తగ్గిపోయింది. దీంతో అవకాశాలు తక్కువయ్యాయి. ఇప్పుడు ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. ఎవరో గుర్తుపట్టండి.
పైన ఫోటోలో అందంగా.. అమాయకంగా కనిపిస్తున్న ఆ బుడతడు మరెవరో కాదు.. లవర్ బాయ్ తరుణ్. మాస్టర్ తరుణ్ పేరుతో బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చి హీరోగా మారారు. అతను సినీనటి రోజారమణి కుమారుడు. అంజలి చిత్రంతో చైల్డ్ ఆర్టిస్ట్ గా మెప్పించిన ఆయన.. ఆ దర్వాత దళపతి.. ఆదిత్య 369, గౌరమ్మ, తేజ, సాహసం వంటి చిత్రాల్లో నటించారు. ఇక చివరగా నువ్వే కావాలి సినిమాతో హీరోగా అరంగేట్రం చేశారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత వచ్చిన ప్రియమైన నీకు.. నువ్వు లేక నేను లేను, చిరుజల్లు, నువ్వే నువ్వే వంటి చిత్రాలు అప్పట్లో భారీ విజయాన్ని అందుకున్నాయి.
ఇక ఆ తర్వాత వచ్చిన అదృష్టం, నిన్నే ఇష్టపడ్డాను, సఖియా, సోగ్గాడు, భలే దొంగలు చిత్రాలు అంతగా ఆకట్టుకోలేదు. దీంతో తరుణ్ కు అవకాశాలు నెమ్మదిగా తగ్గిపోయాయి.కొన్నాళ్లుగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ బిజినెస్ చూసుకుంటున్నారు తరుణ్. సినిమాలకు దూరమయిన.. సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటారు. ఎప్పటికప్పుడు ఇంట్రెస్టింగ్స్ పోస్ట్స్ చేస్తూ ఫాలోవర్లకు టచ్ లో ఉంటారు. తరుణ్ చివరి సారిగా నటించిన సినిమా ఇది నా లవ్ స్టోరీ.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.