Actress: ఒకప్పుడు చాక్లెట్స్ అమ్మిన అమ్మాయి.. ఇప్పుడు తెలుగులో టాప్ హీరోయిన్.. ఎవరో గుర్తు పట్టారా?

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో స్టార్స్ గా వెలుగొందుతోన్న వారిలో చాలా మంది చిన్నతనంలో కన్నీటి కష్టాలు ఎదుర్కొన్న వారే. ఈ టాలీవుడ్ హీరోయిన్ కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతుంది. ఈ క్యూటీ ఒకప్పుడు తన కుటుంబ పోషణ కోసం చాక్లెట్స్ అమ్మింది.

Actress: ఒకప్పుడు చాక్లెట్స్ అమ్మిన అమ్మాయి.. ఇప్పుడు తెలుగులో టాప్ హీరోయిన్.. ఎవరో గుర్తు పట్టారా?
Tollywood Actress

Updated on: Jun 11, 2026 | 6:58 PM

పై ఫొటోలో ఉన్న చిన్నారిని గుర్తు పట్టారా? ఈ బుజ్జాయి ఇప్పుడు దక్షిణాది సినిమా ఇండస్ట్రీలోనే మోస్ట్ ట్యాలెంటెడ్ హీరోయిన్. సాధారణంగా స్టార్ హీరోయిన్ అనగానే ఎక్కువగా గ్లామరస్ రోల్స్ చేస్తుంటారు.. కానీ అమ్మడు మాత్రం స్కిన్ షోకు దూరం. కేవలం నటనకు ప్రాధాన్యమున్న పాత్రలనే ఎంచుకుంటోంది. అందుకే ఈ అమ్మడి ఖాతాలో సూపర్ హిట్ సినిమాలు ఉన్నా పెద్ద హీరోల సినిమాల్లో మాత్రం ఛాన్సులు రావడం లేదు. అయితేనేం లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో జెట్ స్పీడ్ లో దూసుకుపోతోంది. అయితే ఈ స్థాయికి రావడానికి ఈ ముద్దుగుమ్మ చాలా కష్టాలు పడింది. చిన్న వయసులోనే పెద్ద బాధ్యతలను భుజాన కెత్తుకుంది. కుటుంబ పోషణ కోసం స్కూల్, కాలేజ్ వయసులోనే మార్కెటింగ్ ఉద్యోగాల్లోకి అడుగుపెట్టింది. పెద్ద పెద్ద సూపర్ మార్కెట్ల ముందు నిలబడి వచ్చే కస్టమర్లకు చాక్లెట్లను చూపిస్తూ.. ‘సార్.. ఈ చాక్లెట్లు టేస్ట్ చూడండి.. కొనండి’ ప్రమోటింగ్ జాబ్స్ చేసింది. అలా వచ్చిన డబ్బుతోనే తన ఫ్యామిలీ బండిని నడిపింది. ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలమే ఇప్పుడు స్టార్ హీరోయిన్ రేంజ్.

పై ఫొటోలో ఉన్నది మరెవరో కాదు సంక్రాంతికి వస్తున్నాం సినిమా హీరోయిన్ ఐశ్వర్యా రాజేష్. కాగా ఈ అమ్మాయికి 8 ఏళ్ల వయసు ఉన్నప్పుడే ఆమె తండ్రి, ప్రముఖ నటుడు రాజేష్ కన్నుమూశారు. దీంతో తల్లి నాగమణి కుటుంబాన్ని పోషించింది ఎల్ఐసీ ఏజంట్ గా పని చేసింది. ఇంటింటికీ తిరిగి చీరలు అమ్మింది. అలాగే కుటుంబ పోషణ కోసం రియల్ ఎస్టేట్ కూడా చేసింది. అయితే ఐశ్వర్యకు 11 ఏళ్లు ఉన్నప్పుడు పెద్ద అన్నయ్య, 14 ఏళ్లు వచ్చేసరికి రెండో సోదరుడు రోడ్డు ప్రమాదాల్లో చనిపోయారు. దీంతో తన తల్లికి తోడుగా ఐశ్వర్య కూడా చిన్న చిన్న ఉద్యోగాలు చేసింది. చదువుకునే వయసులోనే మార్కెటింగ్ జాబ్స్ చేస్తూ తన కుటుంబాన్ని పోషించింది.

ఇవి కూడా చదవండి

ఐశ్వర్య రాజేష్ లేటెస్ట్ ఫొటోస్..

ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ‘మహేంద్ర గిరి వారాహి’ అనే సినిమాలో నటిస్తోంది ఐశ్వర్య. అక్కినేని సుమంత్ ఇందులో హీరోగా నటిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us