Tollywood: చారడేసి కళ్ల ఈ చిన్నారిని గుర్తు పట్టారా? ఈ క్రేజీ హీరోయిన్ త్వరలో ఆ స్టార్ హీరోకు భార్య కానుంది

|

Sep 07, 2024 | 10:47 AM

తెలుగు ప్రాంతానికే చెందిన ఈ ముద్దుగుమ్మ మోడల్ గా కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఎక్కువగా కథా ప్రాధాన్య చిత్రాల్లోనే నటించే ఈ అందాల తార గ్లామర్ ను ఒలికించడంలోనూ ఎలాంటి హద్దులు పెట్టుకోలేదు. అందుకే పాన్ ఇండియా స్థాయిలో బాగా ఫేమస్ అయిపోయింది. సినిమాల సంగతి పక్కన పెడితే..

Tollywood: చారడేసి కళ్ల ఈ చిన్నారిని గుర్తు పట్టారా?  ఈ క్రేజీ హీరోయిన్ త్వరలో ఆ స్టార్ హీరోకు భార్య కానుంది
Tollywood Actress Childhood Photo
Follow us on

పై ఫొటోలో చారడేసి కళ్లు, రెండు జడలతో కనిపిస్తోన్న చిన్నారిని గుర్తు పట్టారా? ఈ అమ్మాయి ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్. కేవలం దక్షిణాదిలోనే కాదు హిందీలోనూ వరుసగా సినిమాలు, వెబ్ సిరీస్ లు చేస్తోంది. తెలుగు ప్రాంతానికే చెందిన ఈ ముద్దుగుమ్మ మోడల్ గా కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఎక్కువగా కథా ప్రాధాన్య చిత్రాల్లోనే నటించే ఈ అందాల తార గ్లామర్ ను ఒలికించడంలోనూ ఎలాంటి హద్దులు పెట్టుకోలేదు. అందుకే పాన్ ఇండియా స్థాయిలో బాగా ఫేమస్ అయిపోయింది. సినిమాల సంగతి పక్కన పెడితే.. ఈ సొగసరి త్వరలోనే తన జీవితంలో కొత్త ఆధ్యాయానికి శ్రీకారం చుడుతోంది. బ్యాచిలర్ లైఫ్ కు బై బై చెబుతూ పెళ్లి పీటలు ఎక్కనుంది. అది కూడా ఓ ఫేమస్ హీరోతో కలిసి. త్వరలోనే ఓ పెద్దింటికి కోడలిగా వెళ్లనున్న ఈ క్యూటీ మరెవరో కాదు శోభితా ధూళిపాళ్ల.ఇది ఆమె చిన్ననాటి ఫొటో. చూశారుగా చారడేసి కళ్లు, రెండు జళ్లతో ఎంత అందంగా కనిపిస్తుందో చిన్ననాటి శోభితా ధూళిపాళ్ల.

ఆగస్టు 08న నాగచైతన్య, శోభితాల నిశ్చితార్థం జరిగింది. కేవలం ఇరు కుటుంబ సభ్యులు, స్నేహితులు, సమక్షంలోనే ఈ వేడుక జరిగింది. అయితే చైతన్య, శోభితలు గత రెండేళ్లుగా ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. 2022లో వీరిద్దరు మొదటిసారి ఒకరికొకరు పరిచయం అయ్యారట. ఆ తర్వాత అదికాస్తా ప్రేమగా మారింది. ఇరు కుటుంబాల పెద్దలు కూడా వీరి ప్రేమను ఆశీర్వదించడంతో గత నెలలో నిశ్చితార్థం చేసుకున్నారు.అయితే ఈ ప్రేమ పక్షుల వివాహం వచ్చే ఏడాదిలోనే జరగనుంది. అప్పటిలోపు తమ చేతిలో ఉన్న సినిమా ప్రాజెక్టులను పూర్తి చేసుకునే పనిలో ఉన్నారీ లవ్ బర్డ్స్. నాగ చైతన్య ప్రస్తుతం తండేల్ చిత్రీకరణలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి

ఎంగేజ్ మెంట్ వేడుకల్లో నాగార్జున, నాగ చైతన్య, శోభితా ధూళిపాళ్ల..

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.