
పై ఫొటోలో సర్కిల్ ఉన్న కుమారుడిని గుర్తు పట్టారా? ఈ పిల్లాడు ఇప్పుడు పాన్ ఇండియా హీరో. సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా, గాడ్ ఫాదర్ అండ లేకుండా స్వయం కృషితో స్టార్ హీరోగా ఎదిగిన వాళ్లలో ఈ నటుడు ఒకడు. అందుకే ఈ హీరోకు కోట్లాది మంది అభిమానులున్నారు. చాలా మంది లాగే ఇతను కూడా ఒక సాధారణ కుటుంబంలోనే పుట్టాడు. తండ్రి జైలు సూపరింటెండెంట్.. అక్కేమో డాక్టర్.. ఇతను కూడా కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్, ఎంబీఏ లాంటి పెద్ద చదువులే చదివాడు. అయితే సాఫ్ట్ వేర్ లాంటి ఉద్యోగాలకు వెళ్లకుండా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. మొదట బుల్లితెరపై యాంకర్ గా కెరీర్ ప్రారంభించాడు. ఆ తర్వాత వెండితెరపై సైడ్ యాక్టర్ గా చేశాడు. స్టార్ హీరోల సినిమాల్లో సహాయక నటుడిగా మెప్పించారు. తనదైన నటనతో ప్రేక్షకులను అలరించాడు. అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ ఇప్పుడు పాన్ ఇండియా హీరో రేంజ్ కు ఎదిగిపోయాడు. ఇంతకీ అతనెవరనుకుంటున్నారు?
ఈ సంక్రాంతికి పరాశక్తి సినిమాతో ఆడియెన్స్ ను పలకరించాడు కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్. జనవరి 10న విడుదలైన ఈ సినిమా మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. అయితే ఇందులో శివ కార్తికేయన్ నటన విమర్శకుల ప్రశంసలు అందుకుంది. కాగా గత కొన్నేళ్లుగా వరుసగా విజయాలు అందుకుంటున్నాడు శివ కార్తికేయన్. మహావీరుడు, అలయాన్, అమరన్, మదరాసి.. ఇలా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో కోలీవుడ్ లో స్టార్ హీరో రేంజ్ కు ఎదిగిపోయాడు కార్తికేయన్. అయితే భారీ అంచనాలతో రిలీజైన పరాశక్తి సినిమా మాత్రం నెగెటివ్ టాక్ తో నడుస్తోంది. సుధా కొంగర తెరకెక్కించిన ఈ పీరియాడికల్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో శ్రీలీల హీరోయిన్ గా నటించింది. జయం రవి, అధర్వ మురళి కీలక పాత్రలు పోషించారు.
பொங்கலோ பொங்கல்!!
உங்கள் உள்ளங்களிலும், இல்லங்களிலும் மகிழ்ச்சி பொங்கட்டும் 🙏🙏
அனைவருக்கும் இனிய தமிழர் திருநாள் நல்வாழ்த்துகள் 😊🙏#HappyPongal #HappySankranti #ParasakthiPongal ❤️🤗 pic.twitter.com/luhcQ2Qx89
— Sivakarthikeyan (@Siva_Kartikeyan) January 15, 2026
Coming to you, earlier than expected 🔥#Parasakthi – in theatres worldwide from January 10th, 2026 ✊
Get ready for a ride through history🚂#ParasakthiFromPongal#ParasakthiFromJan10@siva_kartikeyan @Sudha_Kongara @iam_ravimohan @Atharvaamurali @gvprakash @DawnPicturesOff… pic.twitter.com/HigIPxkYFL
— DawnPictures (@DawnPicturesOff) December 22, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.