
పై ఫొటోలో క్యూట్ లుక్స్ తో కట్టిపడేస్తున్నదెవరో గుర్తు పట్టారా? ఆమె ఇప్పుడు తెలుగులో ప్రముఖ నటి. ఈ మధ్యన ఈ ముద్దుగుమ్మ పేరు తెగ వినిపిస్తోంది. రాయలసీమ ప్రాంతానికి చెందిన ఈమె సినిమాలపై ఆసక్తితో హైదరాబాద్ లో అడుగు పెట్టింది. దిల్ సుఖ్ నగర్ హాస్టల్ లో ఉండి యాక్టింగ్ నేర్చుకుంది. స్నేహితులు, సన్నిహితుల సహకారంతో సినిమాల్లో అవకాశాలు సొంతం చేసుకుంది. ఒకటి రెండు సినిమాల్లో నటించింది. కానీ పెళ్లి చేసుకుని సడెన్ గా సినిమా ఇండస్ట్రీకి దూరమైంది. అత్తింటి వారు ఒప్పుకోరన్న కారణంతో సినిమాలకు బై బై చెప్పేసింది. అయితే మధ్యలో కుటుంబ పరంగా ఆర్థిక సమస్యలు తలెత్తడంతో ఓ జ్యూయెలరీ షాపులో సేల్స్ గర్ల్ గా పని చేసింది. అయితే గంటల కొద్దీ నిలబడాల్సి ఉండడంతో ఎక్కువ రోజులు ఆ జాబ్ చేయలేకపోయింది. దీంతో మళ్ల ఇండస్ట్రీ వైపు చూసింది. యాంకర్ గా కెరీర్ ప్రారంభించింది. తన అందం, మాటలతో అందరి దృష్టిని ఆకర్షించింది. ఆపై ప్రముఖ తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ లోనూ సత్తా చాటింది. ఈ షోలో రెండు సార్లు కంటెస్టెంట్ గా పార్టిసిపేట్ చేసిన ఈ బ్యూటీ ఇప్పుడు స్టార్ యాంకర్ గా మెప్పిస్తోంది. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ సినిమా ఈవెంట్ జరిగినా ఈ అందాల యాంకరమ్మ ఉండాల్సిందే. ఈ పాటికే చాలా మందికి అర్థమై ఉంటుంది మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో? యస్.. పై ఫొటోలో ఉన్నది మరెవరో కాదు స్టార్ యాంకర్ స్రవంతి చొక్కారపు.
కాగా స్రవంతి చాలా ఏళ్ల క్రితమే రాజశేఖర్ మహంకాళి సినిమాలో ఓ చిన్న పాత్రలో నటించంది. ఆ తర్వాత కూడా రెండు, మూడు సినిమాల్లో యాక్ట్ చేసింది. కానీ కొన్ని కారణాలతో ఇండస్ట్రీకి దూరమైంది. చాలా ఏళ్ల తర్వాత మళ్లీ యాంకర్ గా కెరీర్ ప్రారంభించి ఇప్పుడు జెట్ స్పీడ్ లో దూసుకెళ్లిపోతోంది. అన్నట్లు కేవలం యాంకర్ గానే కాదు ఇప్పుడు నటిగానూ రాణిస్తోందీ అందాల తార. స్రవంతి ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ సినిమా హే బలవంత్. సుహాస్, శివానీ నాగారం జంటగా నటించిన ఈ సినిమా శుక్రవారం (ఫిబ్రవరి 21) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డీసెంట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే స్రవంతికి సంబంధించిన త్రో బ్యాక్ ఫొటోలు, వీడియోలు ఆమె గురించి పలు ఆసక్తికర విషయాలు ఇప్పుడు నెట్టంట తెగ వైరలవుతున్నాయి. అందులో భాగంగానే పై ఫొటో ఒకటి నెట్టింట తళుక్కుమంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.