Tollywood: బూరె బుగ్గల చిన్నారి టాలీవుడ్ అడియన్స్ ఫేవరేట్ హీరోయిన్.. సెకండ్ ఇన్నింగ్స్‏లోనూ తగ్గని జోరు..

|

Dec 14, 2023 | 5:41 PM

తెలుగులో మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలతో ఆడిపాడింది. 2007లో మొదలైన ఈ ముద్దుగుమ్మ సినీ ప్రయాణం ఇప్పటికీ సక్సెస్‏ఫుల్ గా కొనసాగుతుంది. పెళ్లి తర్వాత కొన్నాళ్లు ఇండస్ట్రీకి దూరంగా ఉంది. కొంతకాలం గ్యాప్ తర్వాత ఇటీవలే సెకండ్ ఇన్నింగ్స్ షూరు చేసింది. అయినా బ్యాక్ టూ బ్యాక్ అవకాశాలతో ఫుల్ బిజీగా ఉంది. తెలుగులో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ హీరోయిన్

Tollywood: బూరె బుగ్గల చిన్నారి టాలీవుడ్ అడియన్స్ ఫేవరేట్ హీరోయిన్.. సెకండ్ ఇన్నింగ్స్‏లోనూ తగ్గని జోరు..
Actress
Follow us on

పైన ఫోటోలో కనిపిస్తున్న ఆ బూరె బుగ్గల చిన్నారి సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్. అతి తక్కువ సమయంలోనే తనకంటూ స్టార్ డమ్ అందుకుంది. బ్యాక్ టూ బ్యాక్ హిట్ చిత్రాలతో నటించి అలరించింది. తెలుగు, తమిళం, కన్నడ భాషలలో ఎన్నో చిత్రాల్లో కనిపించింది. అందం, అభినయం, అదృష్టం కలిస్తే ఈ బ్యూటీగా కనిపిస్తుంది. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలతో ఆడిపాడింది. 2007లో మొదలైన ఈ ముద్దుగుమ్మ సినీ ప్రయాణం ఇప్పటికీ సక్సెస్‏ఫుల్ గా కొనసాగుతుంది. పెళ్లి తర్వాత కొన్నాళ్లు ఇండస్ట్రీకి దూరంగా ఉంది. కొంతకాలం గ్యాప్ తర్వాత ఇటీవలే సెకండ్ ఇన్నింగ్స్ షూరు చేసింది. అయినా బ్యాక్ టూ బ్యాక్ అవకాశాలతో ఫుల్ బిజీగా ఉంది. తెలుగులో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ హీరోయిన్ ఎవరంటే.. టాలీవుడ్ చందమామ.. కాజల్ అగర్వాల్.

లక్ష్మీ కళ్యాణం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది కాజల్. 2007లో విడుదలైన ఈ మూవీ అప్పట్లో సూపర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత ఇండస్ట్రీలో వరుస ఆఫర్స్ అందుకుంది. 2009లో రామ్ చరణ్ జోడిగా మగధీర సినిమాతో మరో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. తెలుగులో ఈ ముద్దుగుమ్మకు మంచి బ్రేక్ ఇచ్చిన సినిమా ఇదే. ఆ తర్వాత టాప్ హీరోస్ అందరి జోడిగా నటించింది. తెలుగు, తమిళంలో పలు చిత్రాల్లో నటించిన కాజల్.. 2020లో తన స్నేహితుడు వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూని వివాహం చేసుకున్నారు. వీరికి 2022లో నీల్ కిచ్లూ జన్మించాడు. పెళ్లితర్వాత కొన్నాళ్లు గ్యాప్ తీసుకున్న కాజల్.. ఆ తర్వాత మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.

ఇటీవలే భగవంత్ కేసరి సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ డైరెక్టర్ శంకర్, కమల్ హాసన్ కాంబోలో రాబోతున్న ఇండియన్ 2 చిత్రంలో నటిస్తుంది. అలాగే అటు వాణిజ్య ప్రకటనలతో బిజీగా ఉంది. ఇటు బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో క్షణం తీరిక లేకుండా ఉన్న కాజల్ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్. ఎప్పటికప్పుడు ఫ్యామిలీ ఫోటోస్.. తన కుమారుడి ఫోటోస్ పంచుకుంటుంది. అలాగే లేటేస్ ఫోటోషూట్స్ కూడా షేర్ చేస్తుంటుంది. ప్రస్తుతం ఈ బ్యూటీకి సంబంధించిన చిన్ననాటి ఫోటోస్ వైరలవుతున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.