
80’sలో దక్షిణాది చిత్రపరిశ్రమలో ఆమె స్టార్ హీరోయిన్. తెలుగు, తమిళం, మలయాళం భాషలలో అనేక చిత్రాల్లో నటించింది. స్టార్ హీరోస్ సరసన ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో అలరించింది. మెగాస్టార్ చిరంజీవి, కమల్ హాసన్, బాలకృష్ణ వంటి అగ్ర కథానాయకులతో స్క్రీన్ షేర్ చేసుకుని..ఇప్పుడు ఇండస్ట్రీలో సహయ నటిగా రాణిస్తుంది. పెళ్లి, పిల్లలు అంటూ ఇండస్ట్రీకి చాలా సంవత్సరాలు దూరంగా ఉన్న ఆ హీరోయిన్.. ఇప్పుడిప్పుడే రీఎంట్రీ ఇస్తుంది. అలాగే బుల్లితెరపై పలు రియాల్టీ షోలలో జడ్జిగా వ్యవహరిస్తుంది. పైన ఫోటోను చూశారు కదా.. దేవకి సుతుడు శ్రీ కృష్ణుడి గెటప్‌లో ఉన్న అమ్మాయి సీనియర్ హీరోయిన్. ఒకప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్. తెలుగులో అనేక చిత్రాల్లో నటించింది. మెగాస్టార్ చిరంజీవికి బెస్ట్ ఫ్రెండ్. వీరిద్దరి కాంబోలో వచ్చిన అనేక సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాయి. అప్పట్లో చేతినిండా సినిమాలతో బిజీగా ఉండేది. ఇంతకీ ఎవరో గుర్తుపట్టారా.. ?. ఆమె మరెవరో కాదు..సీనియర్ హీరోయిన్.. అలనాటి అందాల తార రాధ. ఈరోజు రాధ పుట్టినరోజు సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు అభిమానులు.
డైరెక్టర్ భారతీరాజా తెరకెక్కించిన అలైగల్ ఓవతిల్లై సినిమాతో సినీరంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత తమిళంలో రజినీ, కమల్ వంటి స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ అందుకుంది. కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా వెలుగుతున్న సమయంలోనే తెలుగులోకి అడుగుపెట్టింది. గోపాలకృష్ణుడు, అత్తకు తగ్గ అల్లుళ్లు, రాక్షసుడు, నాగు, ఆయుధం, అడవి దొంగ వంటి చిత్రాల్లో నటించింది. కెరీర్ మంచి ఫాంలో ఉన్న సమయంలోనే తమ బంధువు.. మణి అనే వ్యాపారవేత్తను వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత భర్తతో కలిసి ముంబైలో సెటిల్ అయ్యింది రాధ.
పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న రాధ భర్తతో కలిసి బిజినెస్ రంగంలో రాణించింది. రాధ సినిమాలకు దూరమైన ఆమె పెద్ద కూతురిని కథానాయికగా ఇండస్ట్రీకి పరిచయం చేసింది. నాగచైతన్య నటించిన జోష్ సినిమాతో రాధ పెద్ద కూతురు కార్తిక తెలుగు తెరకు పరిచయమైంది. ఈ తర్వాత పలు సినిమాల్లో కనిపించింది. ఇక రాధ చిన్న కూతురు సైతం కడలి సినిమా ద్వారా సినీ రంగంలోకి అడుగుపెట్టింది. కానీ రాధ ఇద్దరు కూతుళ్లు తమ తల్లిలాగా స్టార్ డమ్ అందుకోలేకపోయారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.