
సినీతారల వ్యక్తిగత విషయాలు తెలుసుకోవడానికి నెటిజన్స్ తెగ ఆసక్తి చూపిస్తుంటారు. కొందరు మాత్రం ప్రేమ, పెళ్లి గురించి నేరుగా తమ అభిమాన హీరోహీరోయిన్లను సోషల్ మీడియా వేదికగా అడిగేస్తుంటారు. ఫ్యాన్స్ ప్రశ్నలకు కొందరు ఆన్సర్ ఇచ్చిన మరికొందరు మాత్రం మాట దాటేస్తుంటారు. ఇక ఇటీవల కొద్ది రోజులుగా సెలబ్రెటీలు తమ ఫాలోవర్లతో చిట్ చాట్ చేస్తూ సినిమా అప్డేట్స్, ఫ్యామిలీ విషయాలను పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే తమ చిన్ననాటి ఫోటోస్ సైతం నెట్టింట షేర్ చేస్తూ బాల్యం జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటారు. అదే సమయంలో ప్రస్తుతం ఇండస్ట్రీని ఏలేస్తోన్న ఓ స్టార్ హీరోయిన్ చైల్డ్ హుడ్ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. పైన ఫోటోను చూశారు కదా.. చారడేసి కళ్లతో ఎంతో అమాయకంగా.. అంతే అల్లరిగా కనిపిస్తోన్న ఈ చిన్నారికి ఇప్పుడు ఫాలోయింగ్ ఎక్కువగానే ఉంది. ఒకప్పుడు పాన్ ఇండియా స్థాయిలో అగ్రకథానాయికగా కొనసాగిన హీరోయిన్ కూతురే ఈ ఈ చిన్నారి. గుర్తుపట్టండి.
ఇప్పటివరకు బాలీవుడ్ ఇండస్ట్రీలో బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో అలరించిన ఈ బ్యూటీ.. ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల హృదయాలను దొచేసిందుకు సిద్ధమయ్యింది. తనే హీరోయిన్ జాన్వీ కపూర్. దివగంత నటి శ్రీదేవి, నిర్మాత బోనీ కపూర్ దంపతుల పెద్ద కుమార్తె. ధడక్ అంటూ తెరంగేట్రం చేసి తొలి చిత్రానికే నటిగా ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకుంది జాన్వీ. కంటెంట్ ప్రాధాన్యత ఉన్న రోల్స్ సెలక్ట్ చేస్తూ లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు ఎక్కువగా సమయం కేటాయిస్తోన్న జాన్వీ నటనపై విమర్శకులు ప్రశంసలు కురిపించారు.
ఇక ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు టాలీవుడ్ లోకి అడుగుపెడుతుంది. ప్రస్తుతం దేవర చిత్రంలో నటిస్తుంది. ఇందులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. మాస్ యాక్షన్ నేపథ్యంలో రాబోతున్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ చిత్రంలో జాన్వీ మత్య్సకారుడి కుమార్తెగా కనిపించనుంది. ఇందులో ఆమె పాత్రకు యాక్షన్ సన్నివేశాలు ఉండనున్నాయని తెలుస్తోంది. ఈ సినిమాతోపాటు.. రామ్ చరణ్ కొత్త ప్రాజెక్టులోనూ ఈ బ్యూటీ కనిపించనుందని టాక్. అలాగే తెలుగుతోపాటు తమిళంలో అవకాశాలు వచ్చినా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పుకొచ్చింది జాన్వీ.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.