ప్రేమదేశం సినిమాతో తెలుగు అడియన్స్ హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు హీరో అబ్బాస్. తెలుగులో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. అప్పట్లో అబ్బాస్ కు స్పెషల్ ఫ్యాన్స్ బేస్ ఉండేది. ముఖ్యంగా అమ్మాయిల ఫేవరేట్ హీరో అబ్బాస్. అయితే చాలా కాలం క్రితమే ఇండస్ట్రీకి దూరమయ్యాడు అబ్బాస్. ఇప్పుడిప్పుడే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ఈహీరోకు సంబంధించిన ఓ అరుదైన ఫోటో సోషల్ మీడియాలో వైరలవుతుంది. అందులో అబ్బాస్ పక్కన ఉన్న హీరో ఎవరో గుర్తుపట్టరా ?.. సౌత్ ఇండస్ట్రీలో ఆ కుర్రాడు ఇప్పుడు హీరో. ఒక్క సినిమాతోనే ఇటు తెలుగు, అటు తమిళ్ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. అయితే నటనపరంగా ప్రశంసలు అందుకున్నప్పటికీ ఇప్పటికీ స్టార్డమ్ మాత్రం అందుకోలేకపోయారు. గుర్తుపట్టారా ?.. అతను ఎవరో.. అతను ఎవరంటే తమిళ్ హీరో జై. ఈ పేరు చెబితే గుర్తుపట్టడం కష్టమే. కానీ జర్నీ మూవీ హీరో అంటే మాత్రం ఠక్కున గుర్తుపట్టేస్తారు.
కోలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో జై. విజయ్ నటించిన తొలి తమిళ్ సినిమా భగవతిలో చిన్న పాత్ర పోషించాడు జై. ఆ తర్వాత చెన్నై 60028, సుబ్రమణ్యపురం, వామనన్, ఎంగ్యూమ్ అమై, గోవా, రాజా రాణి, బెలూన్ వంటి చిత్రాల్లో కథానాయకుడిగా నటించారు. అయితే ఆ తర్వాత అతను నటించిన కొన్ని చిత్రాలు బాక్సాఫీస్ వద్ద వరుసగా డిజాస్టర్స్ కావడంతో అనుకున్నంతగా అవకాశాలు రాలేదు. దీంతో అటు వెబ్ సిరీస్ చేస్తున్నారు.
చెన్నైలో జన్మించిన జై.. 18 ఏళ్లకే సినీరంగ ప్రవేశం చేశాడు. మొదటి సినిమా విజయ్ దళపతి నటించిన భగవతి. ఇందులో చిన్న పాత్ర పోషించాడు. ఆ తర్వాత తెలుగు, తమిళంలో పలు చిత్రాల్లో నటించి మెప్పించాడు. జై సినీ ప్రయాణంలో జర్నీ సినిమా చాలా స్పెషల్. ఈ మూవీతో తెలుగు ప్రేక్షకులకు సైతం దగ్గరయ్యాడు. వెండితెరపై హీరోగా కొనసాగుతున్న జై.. ఇటీవలే యాక్షన్ వెబ్ సిరీస్ తో అడియన్స్ ముందుకు వచ్చారు. ఇప్పుడు లెబల్ అనే సినిమాలో నటిస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.