
ప్రపంచం మొత్తం ఎదురుచూస్తున్న సినిమా మహేష్ బాబు, రాజమౌళి మూవీ. ఈ సినిమా అప్డేట్స్ కోసం ఎప్పటి నుంచో అభిమానులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. అసలు మహేష్ బాబు, రాజమౌళితో సినిమా చేస్తున్నారు అని అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా మహేష్ బాబు లుక్ తోపాటు టైటిల్ ను అనౌన్స్ చేశారు రాజమౌళి. ఈ మేరకు ఓ భారీ ఈవెంట్ ను ఏర్పాటు చేశారు. అంతే కాదు ఈ సినిమా నుంచి ట్రైలర్ ను కూడా రిలీజ్ చేశారు. ఈ టీజర్ లేపింది సినిమాను మాములుగా కాదు.. హైప్ హైప్ హైప్.. పిచ్చెక్కిపోతున్నారు ప్రేక్షకులు. ఇది కదా మాకు కావాల్సింది.. బాక్సాఫీస్ బద్దలవ్వడమే లేటు అంటూ ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతున్నారు. ఈ సినిమాకు వారణాసి అనే టైటిల్ ను ఖరారు చేశారు.
ఇక టైలర్ లో మహేష్ బాబు లుక్, వీడియోలో కనిపించిన విజువల్స్ చూస్తుంటే మైండ్ బ్లాక్ అవుతుందని అంటున్నారు ప్రేక్షకులు. ఇక నిన్న జరిగిన ఈవెంట్ లో మహేష్ బాబు ఎంట్రీ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. రాజమౌళి ప్రతి సినిమాలో తన హీరో ఎంట్రీని డిఫరెంట్ గా ప్లాన్ చేస్తుంటారు. బాహుబలి సినిమా నుంచి ఈవెంట్స్ లో హీరోల ఎంట్రీ గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు.
కాగా బాహుబలి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రభాస్ పై నుంచి రోప్స్ సహాయంతో స్టేజ్ పైకి పైనుంచి ఎంట్రీ ఇస్తాడు. ఆతర్వాత వచ్చిన ఆర్ఆర్ఆర్ ఈవెంట్ లో చరణ్ ఓ బైక్ బొమ్మ పై , తారక్ ఒక గుర్రం బొమ్మ పై అభిమానులకు అభివాదం చేస్తూ పై నుంచి దిగుతారు. ఇక నిన్నటి ఈవెంట్ లో మహేష్ బాబు ఎంట్రీ అదరగొట్టారు. స్టేజ్ కింద నుంచి ఓ నంది (ఎద్దు) పై కూర్చొని స్టేజ్ పైకి ఎంట్రీ ఇచ్చారు. స్టేజ్ పై నంది పరుగులు పెడుతుండగా మహేష్ దాని పై కూర్చొని చేతిలో త్రిశూలంతో ఎంట్రీ ఇచ్చాడు. అస్సలు ఈ ఎంట్రీ ఉంటుంది.. ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించింది.. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన మహేష్ బాబు ఫోటోలు, ఈవీడియోనే దర్శనమిస్తుంది. సోషల్ మీడియాను ఈ రేంజ్ లో షేక్ చేయడం ఒక్క సూపర్ స్టార్ మహేష్ కే సాధ్యం అంటున్నారు నెటిజన్స్.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.