ఎవర్రా మీరంతా..! వెంకీ రీ రిలీజ్‌లో ఈ అమ్మాయిలు చూడండి ఏం చేశారో..

కొత్త సినిమాలు రిలీజ్ అయిన సాయంత్రానికే పైరసీ అయ్యి ఫోన్ లో వచ్చేస్తున్నాయి.. కానీ పాత సినిమాలు మాత్రం రీ రిలీజ్ అయ్యి థియేటర్స్ లో అదరగొడుతున్నాయి. నెలకు మూడు నాలుగు సినిమాలు రీ రిలీజ్ అవుతున్నాయి. కొత్త సినిమాలు థియేటర్స్ లో సోసోగా ఆడుతుంటే.. రీరిలీజ్ సినిమాలు మాత్రం అదరగొడుతున్నాయి.

ఎవర్రా మీరంతా..! వెంకీ రీ రిలీజ్‌లో ఈ అమ్మాయిలు చూడండి ఏం చేశారో..
Tollywood Movie

Updated on: Jun 24, 2025 | 12:23 PM

ప్రస్తుతం రీ రిలీజ్‌ల ట్రెండ్ నడుస్తుంది. పాత సినిమాలు రీ రిలీజ్ అయ్యి థియేటర్స్ లో అదరగొడుతున్నాయి. నెలకు మూడు నాలుగు సినిమాలు రీ రిలీజ్ అవుతున్నాయి. ఇప్పటికే దాదాపు అందరు హీరోల సినిమాలు రీ రిలీజ్ అయ్యి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అయితే రీ రిలీజ్ సినిమాలకు ప్రేక్షకుల్లో విశేషంగా రెస్పాన్స్ వస్తుంది. ప్రేక్షకులు సినిమాలను ఎంత ఎంజాయ్ చేస్తున్నారంటే.. థియేటర్స్ లో సినిమాలోని సీన్స్ ను రీ క్రియేట్ చేస్తున్నారు. మొదట్లో పాటలకు డాన్స్ లు వేసి వైరల్ చేశారు. ఆతర్వాత ఇప్పుడు సీన్స్ ను రీ క్రియేట్ చేస్తున్నారు.

ఇది కూడా చదవండి : అప్పుడు మాస్ రాజా సినిమాలో సైడ్ రోల్.. ఇప్పుడు స్టార్ హీరో.. ఏకంగా రవితేజ మూవీలో గెస్ట్ గా..

మొన్నామధ్య మహేష్ బాబు నటించిన మురారి సినిమా సమయంలో ఏకంగా థియేట్సర్ లోనే పెళ్లి చేసుకున్నారు కొందరు. అంతే కాదు అక్షింతలతో సందడి చేశారు మరికొందరు. థియేటర్ మొత్తం పెళ్లి వైబ్ తీసుకొచ్చారు. అలాగే ఆరెంజ్ సినిమా సమయంలో సాంగ్స్ కు కోరసులు పాడి అదరగొట్టారు. ఇక అమ్మాయిలైతే తమ ఫేవరేట్ సాంగ్స్ వస్తే చాలు డాన్స్ లు చేస్తూ సందడి చేస్తుంటారు. తాజాగా ఇద్దరు అమ్మాయిలు థియేటర్స్ లో చేసిన డాన్స్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఇది కూడా చదవండి : ఏం సినిమారా అయ్యా..! మెంటలెక్కి పోవాల్సిందే.. ఫ్యామిలీతో కలిసి చూడకపోవడం మంచిది

చాలా సినిమాల్లానే మొన్నామధ్య మాస్ మహారాజ రవితేజ నటించిన వెంకీ సినిమా కూడా రీ రిలీజ్ అయ్యింది. ఈ సినిమాకు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా ఈ సినిమాలో బ్రహ్మానందం, రవితేజ సీన్స్ ను బాగా ఎంజాయ్ చేశారు ఆడియన్స్.. అలాగే సాంగ్స్ కూడా స్టెప్పులేసి అదరగొట్టారు. వారిలో ఇద్దరు అమ్మాయిలు కూడా డాన్స్ ఇరగదీశారు. కాగా ఓ సాంగ్ మధ్యలో రవితేజ మాస్క్ పెట్టుకొని స్నేహాను భయపెట్టే సీన్ ఉంటుంది. ఆ అమ్మాయిలు కూడా రవితేజాలా మాస్క్ పెట్టుకొని థియేటర్స్‌లో సందడి చేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోకి నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

ఇది కూడా చదవండి : గుర్తుందా మావ..! అప్పట్లో టిక్ టాక్‌ను ఊపేసిన ఈ అమ్మాయి.. ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి