
సమంత పెళ్లిపై దేశమంతా చర్చ జరుగుతోందిప్పుడు. అదే సమయంలో… ‘భూత శుద్ధి’ వివాహం గురించీ మాట్లాడుకుంటున్నారు. ప్రాచీన యోగ సంప్రదాయంలో ఒకటి.. ఈ ‘భూత శుద్ధి’ వివాహ పద్ధతి. ఇంతకీ ఎలా ఉంటుందా పెళ్లి తతంగం..! ఆ పెళ్లి క్రతువుకు ఉన్న ప్రాధాన్యత ఏంటి? దీని గురించే ఇంటర్నెట్‌లో సెర్చ్ చేస్తున్నారు. సేమ్ టైమ్.. రాజ్ నిడిమోరుతో జీవితాన్ని పంచుకోవాలని ఎందుకనుకుంది సమంత? వాళ్లిద్దరు ఎక్కడ, ఎప్పుడు, ఎలా ఒక్కటయ్యారు? ఈ విషయంపైనా పెద్ద చర్చే జరుగుతోంది. సాధారణ పెళ్లి తంతులా జరగలేదు సమంత వివాహం. భర్యభర్తల మధ్య అనుబంధాన్ని పెంచే ఓ విశిష్ఠ ప్రక్రియతో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది సమంత. రాజ్ నిడిమోరు ఎవరో మరీ విపులంగా చెప్పక్కర్లేదు. ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్‌కు డైరెక్టర్స్‌గా ఉన్న ఇద్దరిలో ఒకరే ఈ రాజ్ నిడిమోరు. పాపులర్ ఫిల్మ్ మేకర్. పక్కా తెలుగుబ్బాయి. పుట్టిపెరిగిందంతా తిరుపతిలోనే. ఉద్యోగం కోసం అమెరికా వెళ్లి, సినిమాలపై ఇంట్రస్ట్‌తో అటువైపు ప్రయాణం సాగించారు. తనలాగే ఆలోచించే కృష్ణ దాసరి-డీకేతో కలిసి మొదట షార్ట్ ఫిల్మ్ తీశారు. అది సక్సెస్ అవడంతో ‘ఫ్లేవర్స్’ టైటిల్‌తో ఇంగ్లీష్ మూవీ తీశారు. ఆ తరువాత.. మరింత సక్సెస్ కోసం ఇండియాకొచ్చి ’99’ అనే హిందీ సినిమాను డైరెక్ట్ చేశారు. ‘ఇంకోసారి’ అనే తెలుగు సినిమాకు రైటర్స్‌గానూ పనిచేశారు. ‘షోర్ ఇన్ ద సిటీ’, ‘గో గోవా డాన్’ సినిమాలను తెరకెక్కించారు. ‘డీ ఫర్...