Celebrity Baby Names: రామ్ చరణ్ ‘క్లిన్ కార’, ఎన్టీఆర్ ‘అభయ్’.. సెలబ్రిటీ పిల్లల పేర్లకు అర్ధం తెలుసా!

వెండితెరపై మెరిసే తారల జీవితం అంటేనే ఒక గ్లామర్ ప్రపంచం. వారు ఏం చేసినా, ఏ బట్టలు వేసుకున్నా అది ఒక ట్రెండ్ అవుతుంది. అయితే ఇటీవల కాలంలో సినీ సెలబ్రిటీలు ఒక విషయంలో మాత్రం పాత పద్ధతులను, మన భారతీయ సంప్రదాయాలను ఫాలో అవుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు.

Celebrity Baby Names: రామ్ చరణ్ ‘క్లిన్ కార’, ఎన్టీఆర్ ‘అభయ్’.. సెలబ్రిటీ పిల్లల పేర్లకు అర్ధం తెలుసా!
Ram Charan N Deepika

Updated on: Jan 22, 2026 | 9:44 PM

గతంలో తమ పిల్లలకు ఫ్యాన్సీగా లేదా వెస్ట్రన్ స్టైల్‌లో ఉండే పేర్లు పెట్టడానికి ఇష్టపడేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. మన పురాణాలు, వేదాలు, సంస్కృత పదాల నుండి అర్థవంతమైన పేర్లను వెతికి మరీ పెడుతున్నారు. ఇటీవలే పండంటి బిడ్డకు జన్మనిచ్చిన దీపికా పదుకొనే తన కుమార్తెకు ఒక అరుదైన పేరు పెట్టింది. అలాగే రామ్ చరణ్, ఉపాసన తమ గారాల పట్టికి పెట్టిన పేరు వెనుక ఒక పెద్ద ఆధ్యాత్మిక అర్థమే ఉంది. మరి ఆ పేర్ల విశేషాలేంటో తెలుసుకుందాం.

స్టార్ కిడ్స్​ పేర్లు..

ప్రస్తుత తరం సెలబ్రిటీలు తమ పిల్లల పేర్లలో ఆధ్యాత్మికతకు, సంస్కృతికి పెద్దపీట వేస్తున్నారు. కేవలం బాలీవుడ్ మాత్రమే కాదు, టాలీవుడ్ అగ్ర హీరోలు కూడా తమ వారసులకు పవర్‌ఫుల్ పేర్లను పెట్టారు. రామ్ చరణ్ – ఉపాసన తమ కుమార్తె పేరు ‘క్లిన్ కార’, లలితా సహస్రనామం నుండి ప్రేరణ పొంది పెట్టిన ఈ పేరుకు ఆధ్యాత్మికంగా ఎంతో శక్తి ఉంది. ఇది అంతర్గత శక్తిని, మేల్కొలుపును సూచిస్తుంది.

ఎన్టీఆర్- ప్రణతి తమ కుమారుడికి శివుడి పేరు అయిన ‘అభయ్’ అని పేరు పెట్టారు. అభయ్ అంటే భయం లేనివాడు అని అర్థం. నయనతార – విఘ్నేష్ శివన్ తమ కుమారులకు ‘రుద్రోనీల్’ (శివుడు), ‘దైవిక్’ (దైవిక శక్తి) అని అర్థం వచ్చేలా పేర్లు పెట్టారు.దీపికా పదుకొనే – రణవీర్ సింగ్ తమ కుమార్తెకు ‘దువా’ అని పేరు పెట్టారు. దువా అంటే ప్రార్థన అని అర్థం. తమ జీవితంలోకి ఆ చిన్నారి రావడం ఒక గొప్ప వరంగా భావిస్తూ ఈ పేరును ఎంచుకున్నారు.

యామీ గౌతమ్ – ఆదిత్య ధర్ తమ కుమారుడికి ‘వేదవిద్’ అనే అరుదైన పేరు పెట్టారు. పురాతన వేద పరిజ్ఞానం కలిగినవాడు అని దీని అర్థం. రాజ్ కుమర్ రావు – పత్రలేఖ తమ కుమార్తెకు ‘పార్వతి’ అనే సంప్రదాయ పేరును పెట్టి భారతీయ మూలాల పట్ల తమకున్న గౌరవాన్ని చాటుకున్నారు.

గ్లోబల్ టచ్ – వెరైటీ పేర్లు..

కొంతమంది తారలు ప్రపంచ సంస్కృతులను మేళవిస్తూ విభిన్నమైన పేర్లను ఎంచుకున్నారు. కియారా అద్వానీ – సిద్ధార్థ్ మల్హోత్రా తమ కుమార్తెకు ‘సారాయా’ అని పేరు పెట్టారు. ఇది హీబ్రూ పదం, దీని అర్థం ‘రాకుమారి’. అథియా శెట్టి – కెఎల్ రాహుల్ తమ కుమార్తె పేరు ‘ఎవారా’ అంటే దేవుడిచ్చిన కానుక అని అర్థం. వరుణ్ ధావన్ – నటాషా దలాల్ తమ పాపకు ‘లారా’ అని పేరు పెట్టారు.

దీనికి లాటిన్, గ్రీక్ భాషల్లో అందం లేదా కృప అని అర్థాలు ఉన్నాయి. సినిమా తారలు తమ పిల్లలకు పెడుతున్న ఈ పేర్లు కేవలం పిలవడానికి బాగుండటమే కాకుండా, మన సంస్కృతిని, భాషలోని గొప్పతనాన్ని చాటిచెబుతున్నాయి. ఈ ట్రెండ్ ద్వారా సామాన్యులు కూడా తమ పిల్లలకు అర్థవంతమైన పేర్లు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నారు.