Tollywood: బస్సు డ్రైవర్ కొడుకు.. పేద కుటుంబం.. కట్ చేస్తే.. ట్రిపుల్ హ్యాట్రిక్ విజయాల డైరెక్టర్

సినిమా ఇండస్ట్రీలో రాణించడం అంటే ఆషామాషీ విషయం కాదు. అదీ వరస విజయాలు నమోదు చేయడం అంటే బాగా సుడి ఉన్నట్లే. ఇతను మాత్రం అలవోకగా విజయాలు నమోదు చేస్తున్నాడు. ప్రతి సంక్రాంతికి ఓ ఫ్యామిలీ బ్లాక్ బాస్టర్ సినిమా ఇస్తూ మోస్ట్ హ్యాపెనింగ్ డైరెక్టర్‌గా మారాడు.

Tollywood: బస్సు డ్రైవర్ కొడుకు.. పేద కుటుంబం.. కట్ చేస్తే.. ట్రిపుల్ హ్యాట్రిక్ విజయాల డైరెక్టర్
Tollywood Director

Updated on: Jan 27, 2026 | 9:02 AM

తెలుగులో ఫ్లాప్ అంటూ లేని దర్శకుడు ప్రస్తుత జనరేషన్‌లో ఎవరు అంటే వెంటనే గుర్తొచ్చే పేరు రాజమౌళి. అంతేకాదు.. ఆయన బాహుబలి సిరీస్, ఆర్.ఆర్.ఆర్ సినిమాలతో తెలుగు సినిమా స్థాయిని నెక్ట్స్‌ లెవల్‌కి తీసుకెళ్లారు. అయితే ఆయన మాత్రమే కాదు.. మరో యువ దర్శకుడు సైతం ఫ్లాప్ అంటూ లేకుండా ఏకంగా ట్రిపుల్ హ్యాట్రిక్ కొట్టాడు. ప్రొడ్యూసర్లకు కాసుల పంట కురిపిస్తున్నాడు. అతనెవరో ఇప్పటికే మీకు అర్థం అయి ఉంటుంది. ఇటీవల పండక్కి మన శంకర వరప్రసాద్ గారూ చిత్రాన్ని ప్రేక్షకులకు అందించిన అనిల్ రావిపూడి. ఈ సినిమా ఇప్పుడు కలెక్షన్ సునామీ సృష్టిస్తోంది. అనిల్ ఇప్పటివరకు.. పటాస్, సుప్రీం, రాజా ది గ్రేట్, ఎఫ్2, సరిలేరు నీకెవ్వరు, ఎఫ్3, భగవంత్ కేసరి, సంక్రాంతికి వస్తున్నాం, మన శంకర వరప్రసాద్ గారూ సినిమాలను తెరకెక్కించారు. ఇవన్నీ కూడా సూపర్ హిట్స్.

దిగువ మధ్య తరగతి కుటుంబ నుంచి వచ్చిన అనిల్.. ఇప్పుడు మోస్ట్ హ్యాపెనింగ్ డైరెక్టర్‌గా మారాడు. అతనితో సినిమా చేసేందుకు ఇప్పుడు ప్రొడ్యూసర్లు ఆరాటపడుతున్నారు. పవన్ కల్యాణ్‌తో తమ్ముడు సినిమా చేసిన అరుణ్ ప్రసాద్ అనిల్‌కు బాబాయ్ అవుతారు. ఆయన ఇన్‌ప్లూయెన్స్ అనిల్‌పై పడింది. అంతేకాదు తండ్రికి కూడా సినిమాలపై విపరీతమైన ఆసక్తి ఉండటంతో.. అలా చిత్ర పరిశ్రమపై ఆకర్షణకు లోనయ్యాడు. అనిల్ తండ్రి ఆర్టీసీ బస్సు డ్రైవర్.. జీతం చాలా తక్కువ అయినప్పటికీ.. కొడుక్కి ఏ మాత్రం లోటు లేకుండా పెరిగాడు. విజ్ఞాన్ కాలేజ్‌లో ఓ స్కిట్ చేయడంతో.. విపరీతమైన అప్లాజ్ వచ్చింది. దీంతో ఆ కిక్ నచ్చి.. అనిల్‌ స్టడీస్ అయిపోగానే ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చి అసిస్టెంట్ డైరెక్టర్‌గా జాయిన్ అయ్యారు. ఆ తర్వాత రైటర్‌గా మారి బాగా సక్సెస్ అయ్యాక.. పటాస్ సినిమాతో డైరెక్టర్‌గా టర్న్ అయ్యారు.

Anil Ravipudi

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.