Folk Dancer : ఆ హీరో అంటే పిచ్చి ఇష్టం.. అతడి సినిమాలో ఒక్క చిన్న రోల్ వచ్చిన చాలు.. ఫోక్ డ్యాన్సర్ నాగదుర్గ..

ఫోక్ ప్రపంచంలో తనదైన ముద్ర వేసింది డ్యాన్సర్ నాగదుర్గ. ఇప్పటివరకు ఎన్నో హిట్ సాంగ్స్ చేసిన ఆమె... అందం, డ్యాన్స్, లుక్స్ తో కట్టిపడేస్తుంది. తనకు నటనపై ఆసక్తి ఉందని.. కానీ లేడీ ఓరియెంటెడ్ చిత్రాల కోసమే వెయిట్ చేస్తున్నట్లు తెలిపింది. అలాగే ఇండస్ట్రీలో తనకు ఇష్టమైన హీరోహీరోయిన్ గురించి చెబుతూ ఆసక్తికర విషయాలు పంచుకుంది.

Folk Dancer : ఆ హీరో అంటే పిచ్చి ఇష్టం.. అతడి సినిమాలో ఒక్క చిన్న రోల్ వచ్చిన చాలు..  ఫోక్ డ్యాన్సర్ నాగదుర్గ..
Naga Durga

Updated on: Mar 21, 2026 | 11:38 AM

ప్రస్తుతం తెలంగాణ ఫోక్ సాంగ్స్ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నాయి. యూట్యూబ్ లో మిలియన్ వ్యూస్ అందుకుంటూ దూసుకుపోతున్నాయి. అలాగే ఈ పల్లె పాటలలో కనిపించే ఫోక్ డ్యాన్సర్స్ సైతం పాపులర్ అవుతున్నారు. ఒకటి కాదు రెండు కాదు.. వందల పాటలలో ప్రధాన పాత్రలో కనిపిస్తూ తమకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. పల్లె పాటలకు ఎనర్జిటిక్ డ్యాన్సులతో అదరగొట్టేస్తున్నారు. వారిలో నాగ దుర్గ ఒకరు. తెలుగు డిజిటల్ తెరపై తనదైన ముద్ర వేసిన ఫోక్ డాన్సర్ నాగదుర్గ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. కేవలం డాన్సర్‌గానే కాకుండా, తన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్, విభిన్నమైన కాస్ట్యూమ్స్‌తో సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె తన కెరీర్, వ్యక్తిగత విషయాలు, తన లేటెస్ట్ సాంగ్ ‘సీనయ్య’ గురించి ఆసక్తికర విశేషాలను పంచుకున్నారు.

ఎక్కువ మంది చదివినవి : హీరోయిన్ ఛాన్స్ వస్తే వద్దని చెప్పింది.. బుల్లితెరపై గ్లామర్ అరాచకం..

నల్గొండకు చెందిన నాగదుర్గ కేవలం ఫోక్ డాన్సర్ మాత్రమే కాదు, ఆమె ఒక ప్రొఫెషనల్ కూచిపూడి కళాకారిణి కూడా. యూకేజీ నుంచే డాన్స్ నేర్చుకుంటున్న ఆమె, దాదాపు 18 ఏళ్లుగా ఈ రంగంలో ఉన్నారు. కూచిపూడిలో మాస్టర్స్ (MA) పూర్తి చేసిన ఆమె, ప్రస్తుతం ‘నాగదుర్గ నృత్యాలయం’ పేరుతో డాన్స్ స్కూల్ నడుపుతూ 50 మందికి పైగా విద్యార్థులకు కూచిపూడి శిక్షణ ఇస్తున్నారు. భవిష్యత్తులో కూచిపూడిలో పీహెచ్‌డీ చేయాలన్నది ఆమె లక్ష్యమని తెలిపారు. కోవిడ్ సమయంలో సరదాగా యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసిన వీడియోలు ఆమెకు గుర్తింపు తెచ్చాయని గుర్తు చేసుకున్నారు. ‘తిన్నా తీరం పడతలే’ సాంగ్ ఆమె కెరీర్‌ను మలుపు తిప్పిందని.. ఈ పాట తర్వాత ‘కాపుల ఇంటికాడ’ సాంగ్ నాలుగు భాగాలుగా వచ్చి మిలియన్ల వ్యూస్ సాధించిందని అన్నారు. ఇప్పటివరకు ఎన్నో సాంగ్స్ చేసినట్లు గుర్తుచేసుకున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Trending Folk Song : ఏం సాంగ్ రా బాబూ.. నెల రోజులుగా యూట్యూబ్‏లో గత్తరలేపుతుంది.. డీజేలో మోగిపోతున్న పల్లె పాట..

నటనపై ఆసక్తి ఉన్నప్పటికీ, తాను చాలా సెలెక్టివ్ గా కథలు ఎంచుకుంటానని అన్నారు. ఇప్పటివరకు తనకు 100కు పైగా అవకాశాలు వచ్చినా, ఫీమేల్ ఓరియెంటెడ్ కథల కోసమే వేచి చూస్తున్నట్లు చెప్పారు. అలాగే సినిమాల్లో హీరోయిన్ స్నేహ అంటే ఇష్టమని.. ఇక హీరో ప్రభాస్ అంటే వీరాభిమానం అని, ఆయన సినిమాలో చిన్న పాత్ర వచ్చినా వదులుకోనని తన మనసులోని మాటను బయటపెట్టారు. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ వైరలవుతున్నాయి.

ఎక్కువ మంది చదివినవి : Suddala Ashok Teja : ఫిట్‏గా ఉన్న శ్రీహరి చిక్కిపోయి చనిపోవడానికి అసలు కారణం అదే.. రచయిత సుద్దాల అశోక్ తేజ..

ఎక్కువ మంది చదివినవి : RP Patnaik: ఆ పాటకు రాత్రంతా డ్యాన్స్ చేస్తూ ఒక అబ్బాయి చనిపోయాడు.. అది ఎప్పటికీ మర్చిపోలేను.. మ్యూజిక్ డైరెక్టర్..

Loading...
Unable to load recommendations.
Follow Us