వాళ్లు చేసిన పనికి కారులో గంటసేపు ఏడ్చేశా.. ఫోక్ డాన్సర్ లాస్య స్మైలీ ఎమోషనల్ కామెంట్స్

ఫోక్ సాంగ్స్ ద్వారా చాలా మంది పాపులర్ అయ్యారు. ఇప్పుడు సినిమా సాంగ్స్ కంటే ఫోక్ సాంగ్స్ కే ఎక్కువ క్రేజ్ ఉంటుంది. చాలా సాంగ్స్ పాన్ ఇండియా క్రేజ్ లో క్రేజ్ సొంతం చేసుకున్నాయి. అలాగే ఫోక్ సాంగ్స్ ద్వారా పాపులర్ అయ్యింది లాస్య స్మైలీ..

వాళ్లు చేసిన పనికి కారులో గంటసేపు ఏడ్చేశా.. ఫోక్ డాన్సర్ లాస్య స్మైలీ ఎమోషనల్ కామెంట్స్
Lasya Smily

Updated on: Jan 11, 2026 | 12:00 PM

రీసెంట్ డేస్ లో సినిమా పాటలతో పాటు ఫోక్ సాంగ్స్ కూడా పాపులర్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతున్నాయి. యూట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాయి ఫోక్ సాంగ్స్.. కేవలం ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఫోక్ సాంగ్స్ దుమ్మురేపుతున్నాయి. విదేశాల్లో ఉన్నవారు కూడా మన సాంగ్స్ ను పాడటం, ఆ పాటలకు డాన్స్ లు చేయడం మనం చూస్తూనే ఉన్నాం. అలాగే ఫోక్ సాంగ్స్ ద్వారా చాలా మంది మంచి గురింపు తెచ్చుకున్నారు. వారిలో లాస్య స్మైలీ అనే చిన్నది ఒకరు. ఫోక్ సాంగ్స్ కు డాన్స్ లు వేసి పాపులర్ అయ్యింది ఈ చిన్నది. ఈ ముద్దుగుమ్మ డాన్స్ కు ఆడియన్స్ ఫిదా అవుతున్నారు కాగా గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అలాగే తనకు ఎదురైన ఓ చేదు అనుభవాన్ని కూడా గుర్తుచేసుకుంది.

లాస్య మాట్లాడుతూ.. ఒక గ్రామంలో జరగాల్సిన షూట్ కోసం లాస్యను పిలిచారట. వెళ్ళడానికి ముందే అక్కడ ఎలా ఉంటుంది. స్టే చేయడానికి అన్నివసతులు ఉన్నాయా అని అడిగి తెలుసుకుందట.. అయితే ఆమె లగేజ్ తీసుకుని, మొదటి బస్సు ఎక్కి, రెండవ బస్సు మారిన తర్వాత, ఆ సాంగ్ టీమ్ ఫోన్ చేసిస్టే చేయడానికి రూమ్స్ దొరకలేదు అని చెప్పారట. బదులుగా, ఆ సాంగ్ చేసే వ్యక్తి తన ఇంట్లో రెండు గదులు ఉన్నాయని, అందులో ఒక గదిలో ఆమె ఉండవచ్చని, వారు ఇంకో గదిలో ఉంటారని చెప్పారు. ఆ వ్యక్తులు ఎవరో తెలియకపోవడం, ఒంటరిగా అపరిచితులతో ఉండాలనడంతో  భయపడిపోయిందట. ఆసమయంలో  ఏం చేయాలో పాలుపోక బస్సులోనే ఏడ్చేశా అని చెప్పింది. ఆ క్లిష్ట పరిస్థితుల్లో, ఆమె గతంలో కలిసి పనిచేసిన ఒక వ్యక్తికి ఫోన్ చేసి తన పరిస్థితిని చెప్పిందట. ఆ వ్యక్తి ఆమెకు తన బాబాయ్ నంబర్‌ను ఇచ్చి, ఆయన సహాయం తీసుకోవాలని చెప్పాడట.

లాస్య ఆయనకు కాల్ చేసి మాట్లాడిందట.. ఆతర్వాత ఆమెను పిక్ చేసుకోవడానికి వచ్చిన ఛానెల్ వ్యక్తికి తమతో రాను.. నాకు ఇక్కడ ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ల ఇంట్లోనే ఉంటాను అని చెప్పిన ఆ ఛానెల్ వ్యక్తి ఒప్పుకోలేదట.. తమతోనే రావాలని పట్టుబట్టాడట. దాంతో ఆమె నేను మీతో రాను అని చెప్పి తన ఫ్రెండ్ వాళ్ల బాబాయ్ కారు ఎక్కిందట. కారు ఎక్కగానే ఆమె బోరున ఏడ్చేసిందట.. అప్పుడు పరిశ్రమ ఎంత ప్రమాదకరమైనది, సెక్యూరిటీ లేదు అని అర్ధమైందట. ఆ సంఘటన లాస్య మనసులో చెరగని ముద్ర వేసిందని తెలిపింది. ప్రస్తుతం, లాస్య స్మైలీ తన పనిని చాలా జాగ్రత్తగా ఎంపిక చేసుకుంటారు. షూట్‌కు ఒప్పుకునే ముందు పాట వివరాలు, ఏమైనా ప్రత్యేక సీన్స్ ఉన్నాయా లేదా అని ముందే అడుగుతా అని తెలిపింది.  ఒక నెలలో 10 నుండి 20 షూట్‌లలో పాల్గొంటున్నా. షూట్‌లు రెగ్యులర్‌గా జరుగుతాయి, ఒక లొకేషన్ పూర్తవగానే రాత్రి ప్రయాణం చేసి మరుసటి రోజు ఉదయానికల్లా మరో లొకేషన్‌కు వెళ్తున్నా అంటూ చెప్పుకొచ్చారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి.