
కేవలం హీరోలు, హీరోయిన్స్ మాత్రమే కాదు.. ఎంతో మంది కమెడియన్స్ కూడా ప్రేక్షకుల మనసుల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. తమ కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన వారు చాలా మంది ఉన్నారు. మెల్ కమెడియన్స్ మాత్రమే కాదు ఫీమేల్ కమెడియన్స్ కూడా చాలా మంది తమ కామిక్ టైమింగ్ తో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నారు. వారిలో కల్పనా రాయ్ ఒకరు. తన యాస, డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్ తో ఎన్నో గుర్తిండిపోయే పాత్రలు పోషించి ప్రేక్షకులకు నవ్వులు పంచారు ఆమె. దాదాపు 440కు పైగా సినిమాల్లో నటించారు కల్పనా రాయ్. ఆమె నటించిన సినిమాల్లో ముఖ్యంగా చెప్పుకోదగినవి జంబలకిడి పంబ, ప్రేమించచుకుందాం రా, కలిసుందం రా ఇలా చాలా సినిమాలు ఆమె ఖాతాలో ఉన్నాయి..
వందల సినిమాలు చేసి సినీ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కల్పనా రాయ్.. చివరి రోజుల్లో మాత్రం ఆర్థిక కష్టాలతో అలమటించారు. ప్రాణంగా పెంచుకున్న కూతురు మోసం చేసి వెళ్లిపోవడంతో ఎంతో మానసిక వేదన అనుభవించారు. చివరకు ఆకలితో అలమటించి ప్రాణాలు కోల్పోయారు కల్పనా రాయ్. 1950లో కాకినాడలో జన్మించిన ఆమె అసలు పేరు సత్యవతి. యుక్తవయసులో ఎంతో అందంగా ఉండేవారట ఆమె. ఒంటినిండా బంగారు నగలు వేసుకుని నడుచుకుంటూ వస్తుంటే రెండు కళ్లు చాలేవి కాదట. నటనపై ఆసక్తితో సినీరంగంలోకి అడుగుపెట్టారు కల్పనా రాయ్. నీడలేని ఆడది సినిమాతో వెండితెరకు పరిచయమై ఆ తర్వాత.. కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా వందలాది చిత్రాల్లో నటించింది. సినిమాల్లో నవ్వించడం మాత్రమే కాదు.. సెట్ లో అందరికీ కడుపు నిండా అన్నం పెట్టేవారట. కష్టాల్లో ఉన్నవారికి తన వంతు సాయం చేసేవారట. కానీ ఆ మంచితనమే ఆమెకు శాపంగా మారిందని అంటున్నారు.
ఆస్తి తగ్గగానే అందరూ ఆమెకు దూరమయ్యారు. పెళ్లి చేసుకుండా ఒంటరిగా ఉన్న కల్పనా.. ఓ అమ్మాయిని దత్తత తీసుకుని పెంచుకుంది. కానీ ఆ అమ్మాయి పెద్దయ్యాక ఓ అబ్బాయిని ప్రేమించి అతడితో వెళ్లిపోయింది. ప్రాణంగా పెంచుకున్న కూతురు తనను మోసం చేసి వెళ్లిపోవడంతో ఎంతో మానసిక క్షోభకు గురయ్యారు కల్పనా.. కూతురు వెళ్లిపోవడం.. డబ్బు పూర్తిగా ఆవిరి కావడంతో ఆమెను పట్టించుకునేవాళ్లే కరువయ్యారు. చనిపోయేముందు పది రోజులపాటు తిండిలేక ఆకలితో ఆలా పాటించారని పలువురు అంటున్నారు. ఎందరికో తన చేతులతో వండి కడుపునింపిన కల్పనా రాయ్ ఆకలికి తట్టుకోలేక ధీన స్థితిలో కన్నుమూశారు. ఆమె చనిపోయిన తర్వాత చితికి నిప్పు పెట్టడానికి కూడా డబ్బుల్లేని పరిస్థితికు చేరుకున్నారట. అంతటి కష్టం ఏ ఆర్టిస్టుకూ రాకూడదు. సినిమాని నమ్ముకున్న ఆమె చితి పేర్చేందుకు వేరేవాళ్లు డబ్బు చేశారని గతంలో నటి జయ శ్రీ ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.