
టాలీవుడ్ క్రేజీ హీరోయిన్, హైదరాబాదీ బ్యూటీ ఫరియా అబ్దుల్లా ఇటీవల సోషల్ మీడియాలో తీవ్రమైన ట్రోల్స్ ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. దీనికి కారణం ముస్లిం అమ్మాయి అయిన ఆమె బోనాల ఉత్సవాల్లో పాల్గొనడమే. కొన్ని రోజుల క్రితం ఫరియా పాతబస్తీలోని మీర్ ఆలం మండిలో ఉన్న శ్రీ మహాకాళి అమ్మవారిని దర్శించుకుంది. సాంప్రదాయ దుస్తుల్లో బంగారు బోనం ఎత్తుకుని అమ్మవారికి సమర్పించింది. అంతేకాదు పోతురాజులతో కలిసి ఎంతో ఉత్సహంగా డ్యాన్సులు చేసింది. అయితే దీనిని కొందరు తప్పుపట్టారు. మతం పేరుతో ఆఫరియాను తీవ్రంగా దూషించారు. అయితే వీటిని వెంటనే ఖండించింది చిట్టి. అప్పుడే సోషల్ మీడియా వేదికగా వీడియో విడుదల చేసి కన్నీళ్లు పెట్టుకుంది. తాను అంతటా భగవంతుడిని చూస్తానంటూ ట్రోలర్లకు స్ట్రాంగ్ కౌంటరిచ్చింది. అయితే తాజాగా మరోసారి బోనాల వివాదంపై స్పందించింది ఫరియా. తమిళనాడు సీఎం విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ తెరకెక్కించిన లేటెస్ట్ సినిమా ‘సిగ్మా’. సందీప్ కిషన్ హీరోగా నటిస్తోన్న ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లా కథానాయిక. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా గాంధీ జయంతి కానుకగా అక్టోబర్ 02న విడుదల కానుంది. దీంతో సినిమా ప్రమోషన్లలో స్పీడ్ పెంచారు మేకర్స్. ఫరియా కూడా వరుసగా ప్రమోషన్స్ ఈవెంట్స్ లో పాల్గొంటోంది. ఈ క్రమంలోనే బోనాల వివాదంపై ఆసక్తికర కామెంట్స్ చేసింది ఫరియా.
‘ఇటీవల సోషల్ మీడియాలో నాపై చాలా విమర్శలు వచ్చాయి. అదే వేదికగా నేను కూడా ఆ వివాదంపై నా అభిప్రాయాన్ని తెలియజేశాను. సోషల్ మీడియా మీద నాకు పెద్దగా ఓపీనియన్ లేదు.. అదొక ప్లాట్‌ఫాం అలానే ఉంటుంది. అయితే, ఒక విషయం మాత్రం నన్ను బాగా వెంటాడింది. మనం 2026లో జీవిస్తున్నాం. . కానీ మైండ్ సెట్ మాత్రం అక్కడే ఆ పాత రోజుల్లోనే ఉంది. ఆ రోజుల నుంచి కొన్ని ఓపీనియన్స్ వస్తున్నాయి.. కానీ నేను మాత్రం అడ్వాన్స్‌గా ఆలోచిస్తూ, అందరినీ ప్రేమించాలనే మైండ్ సెట్ నుంచి వచ్చాను. ప్రతి ఒక్కరి నుంచి కూడా అలాంటి ప్రేమను కోరుకుంటాను.. కానీ అలా జరగలేదు. ప్రతి ఒక్కరికి ఎవరి అభిప్రాయాలు వాళ్లకు ఉంటాయి. నా ఉద్దేశం వాళ్లకు నచ్చితే అలాగే ఫాలో అవుతారు. నేను మాత్రం అందరి ఆలోచనలను నేను గౌరవిస్తాను’ అని ఫరియా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ హీరోయిన్ కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.