
చిన్న సినిమాలు ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి మంచి విజయాలను అందుకుంటున్నాయి. అలాంటి సినిమాల్లో డ్రాగన్ సినిమా ఒకటి. కోలీవుడ్ హీరో ప్రదీప్ రంగనాథన్ నటించిన ఈ చిత్రాన్ని తెలుగులోనూ రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ సినిమాలో కయాదు లోహర్ హీరోయిన్ గా చేసింది. ఈ సినిమాతోపాటు అటు హీరోయిన్ కయాదు లోహర్ సైతం చాలా ఫేమస్ అయ్యింది. ఈ చిత్రంలో డ్రాగన్ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ ఒక హీరోయిన్ నటించగా.. సెకండ్ హీరోయిన్ గా కయాదు లోహర్ నటించి ఆకట్టుకుంది. ఈ అమ్మడి అందానికి కుర్రకారు ఫిదా అయ్యారు. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా వచ్చిన డ్రాగన్ సినిమాతో కయాదు లోహర్ అడియన్స్ హృదయాలను కొల్లగొట్టింది. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ చిన్నదాని పేరే వినిపిస్తుంది.
సినిమాలో అమ్మడి లుక్స్, యాక్టింగ్ అంతా పర్ఫెక్ట్ గా అనిపించింది. అమ్మడి ఫీచర్స్ చూసిన ఎవరైనా సరే స్టార్ మెటీరియల్ అనేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ చిన్నది తెలుగులోకి అడుగుపెట్టనుందని తెలుస్తుంది. గతంలో ఓ తెలుగు సినిమాలో నటించింది. ఇప్పుడు మరో తెలుగు సినిమాలోనూ నటిస్తుందని అంటున్నారు. విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న సినిమాలో ఈ అమ్మడు హీరోయిన్ గా సెలక్ట్ అయ్యిందని టాక్.
కాగా ఇటీవల ఒక ప్రైవేట్ కళాశాల కార్యక్రమానికి హాజరైనప్పుడు అభిమానులు ఆమెను మీకు ఇష్టమైన హీరో ఎవరు అని అడిగారు. దానికి కయాదు లోహర్ తనకు విజయ్ సర్ అంటే ఎప్పుడూ ఇష్టమని, ముఖ్యంగా ఆయన నటించిన తేరి సినిమా అంటే చాలా ఇష్టమని తెలిపింది. అయితే గతంలో కయాదు లోహర్ తన ఫెవరెట్ హీరో ఎవరో చెప్పింది. గతంలో ఈ చిన్నది సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించింది. కాగా అభిమాన తమిళ్ హీరో ఎవరు.? అని అడిగిన ప్రశ్నకు.. కయాదు లోహర్ ధనుష్ పేరు చెప్పింది. ధనుష్ అంటే తనకు చాలా ఇష్టమని చెప్పుకొచ్చింది ఈ చిన్నది. దాంతో విజయ్, ధనుష్ అభిమానుల మధ్య పెద్ద చర్చ జరుగుతుంది. విజయ్ అభిమానులు, ధనుష్ అభిమానులు ఆమె మాట మార్చిందని విమర్శిస్తున్నారు.
Before she got into Vijay’s mouthpiece AGS network.. pic.twitter.com/PwbuMlLYar https://t.co/YEsgfkN8zq
— Trollywood 𝕏 (@TrollywoodX) March 6, 2025