Tollywood : సంవత్సరం అయిపోవస్తున్న కనిపించని స్టార్ హీరోలు.. వేయికళ్లతో ఎదురుచూస్తున్న ఫ్యాన్స్

|

Oct 29, 2023 | 8:51 AM

టాలీవుడ్‌కు 2023 బాగానే కలిసొచ్చింది. వచ్చిన వరకు చాలా మంది హీరోలు బాక్సాఫీస్ దగ్గర మాయ చేసారు. మరీ ముఖ్యంగా సంక్రాంతి నుంచే స్టార్ హీరోల మాయ మొదలైంది. చిరంజీవి, బాలయ్య అప్పుడే అరాచకం చేసి చూపించారు. ఆ తర్వాత బలగం, సామజవరగమనా, బేబీ లాంటి చిన్న సినిమాలు దాన్ని కంటిన్యూ చేసాయి.

Tollywood : సంవత్సరం అయిపోవస్తున్న కనిపించని స్టార్ హీరోలు.. వేయికళ్లతో ఎదురుచూస్తున్న ఫ్యాన్స్
Tollywood
Follow us on

చూస్తుండగానే 2023లో 10 నెలలు గడిచిపోయాయి.. మరో రెండు నెలలు మాత్రమే ఉన్నాయి. ఇప్పటికే రావాల్సిన హీరోలంతా వచ్చేసారు కొందరైతే రెండుసార్లు వచ్చారు.. కానీ పాన్ ఇండియన్ హీరోలు మాత్రం రానంటూ మొండికేస్తున్నారు. ముందు ఇదే ఏడాది వస్తామని చెప్పినా.. తర్వాత మూకుమ్మడిగా హ్యాండిచ్చేసారు. కానీ 2024 మాదే అంటున్నారు వాళ్లు. అలాంటి హీరోలపైనే ఈ రోజు స్పెషల్ ఫోకస్..

టాలీవుడ్‌కు 2023 బాగానే కలిసొచ్చింది. వచ్చిన వరకు చాలా మంది హీరోలు బాక్సాఫీస్ దగ్గర మాయ చేసారు. మరీ ముఖ్యంగా సంక్రాంతి నుంచే స్టార్ హీరోల మాయ మొదలైంది. చిరంజీవి, బాలయ్య అప్పుడే అరాచకం చేసి చూపించారు. ఆ తర్వాత బలగం, సామజవరగమనా, బేబీ లాంటి చిన్న సినిమాలు దాన్ని కంటిన్యూ చేసాయి.

ఫస్ట్ 6 మంత్స్‌లో చిరంజీవి, బాలయ్యతో పాటు ప్రభాస్, పవన్ లాంటి హీరోలు కూడా వచ్చారు. సాయి ధరమ్ తేజ్, బాలయ్య, చిరంజీవి, రవితేజ అయితే రెండుసార్లు వచ్చేసారు.. ఇక నాని కూడా రెండోసారి వచ్చేస్తున్నారు. ప్రభాస్ సైతం సలార్‌తో మరోసారి బాక్సాఫీస్ దండయాత్రకు సిద్ధమవుతున్నారు.

రాబోయే 2 నెలల్లో మరో అరడజన్ క్రేజీ సినిమాలైతే రానున్నాయి. వాటి బిజినెస్ కూడా దాదాపు 500 కోట్లకు పైగానే జరగనున్నాయి. అందులో హాయ్ నాన్న, ఆదికేశవ, ఆపరేషన్ వాలంటైన్, ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్, సలార్ లాంటి సినిమాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే 2023లో ఇంతమంది వచ్చినా.. బన్నీ, చరణ్, తారక్ మాత్రం రావట్లేదు.

రామ్ చరణ్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ ముగ్గురు ఇప్పుడు కేవలం తెలుగు హీరోలు మాత్రమే కాదు.. పాన్ ఇండియన్ స్టార్స్ వాళ్లంతా. ఒక్కొక్కరి సినిమాకు కనీసం 300 కోట్లకు పైగానే మార్కెట్ ఉంది. అలాంటి ముగ్గురు పాన్ ఇండియా స్టార్స్ ఈ కాలెండర్ ఇయర్ మిస్ చేస్తున్నారు. బన్నీ అయితే 2022లోనూ కనిపించలేదు.

అల్లు అర్జున్ ట్విట్టర్..

రామ్ చరణ్ ట్విట్టర్ ..

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..