Sai Sushanth: ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్న ‘ఈ నగరానికి ఏమైంది’ నటుడు.. అమ్మాయి ఎవరంటే?

'ఈ నగరానికి ఏమైంది' సినిమాలో సాయి సుశాంత్ పోషించిన కార్తీక్‌ పాత్ర కూడా హైలెట్‌గా నిలిచింది. బౌన్సర్‌ నుంచి క్లబ్‌ మేనేజర్‌గా ఎదిగి జీవితంలో ఉన్నత స్థానంలోకి వెళ్లాలంటూ కలలు కనే సాధారణ యువకుడి పాత్రలో సాయి సుశాంత్‌ అదరగొట్టాడు.

Sai Sushanth: ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్న ఈ నగరానికి ఏమైంది నటుడు.. అమ్మాయి ఎవరంటే?
Sai Sushanth Engagement

Updated on: Jul 05, 2023 | 3:26 PM

2018లో విడుదలైన ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమా యూత్‌ను తెగ ఆకట్టుకుంది. విశ్వక్‌ సేన్‌, అభినవ్‌ గోమఠం, సాయి సుశాంత్‌ రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌ సూపర్‌హిట్‌గా నిలిచింది. అందుకే ఇటీవల ఈ హిట్‌ సినిమాను కూడా థియేటర్లలో రీ రిలీజ్‌ చేశారు. ఇప్పుడు కూడా భారీ కలెక్షన్లు రాబట్టింది. ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాలో సాయి సుశాంత్ పోషించిన కార్తీక్‌ పాత్ర కూడా హైలెట్‌గా నిలిచింది. బౌన్సర్‌ నుంచి క్లబ్‌ మేనేజర్‌గా ఎదిగి జీవితంలో ఉన్నత స్థానంలోకి వెళ్లాలంటూ కలలు కనే సాధారణ యువకుడి పాత్రలో సాయి సుశాంత్‌ అదరగొట్టాడు. ఆ తర్వాత బొంబాట్‌ అనే సినిమాలో హీరోగా ఛాన్స్‌ దక్కించుకున్నాడు. అలాగే నాగచైతన్య థ్యాంక్యూ సినిమాలో ఓ కీలక పాత్ర పోషించాడు. ఇలా నటునిగా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటోన్న సాయి సుశాంత్ జీవితంలో కొత్త ఆధ్యాయానికి శ్రీకారం చుట్టాడు. త్వరలోనే అతను పెళ్లిపీటలెక్కనున్నాడు. తాజాగా తనకు కాబోయే సతీమణితో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు.

ఈ సందర్భంగా తనకు కాబోయే భార్య చేతికి ఉంగరాన్ని తొడుగుతోన్న ఫొటోను ఇన్‌స్టాలో షేర్‌ చేశాడు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అభిమానులు, నెటిజన్లు సాయి సుశాంత్‌ కు అభినందనలు , శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే ఆ అమ్మాయి ఎవరు అనేది వివరాలు మాత్రం ప్రకటించలేదు. కాగా సాయి సుశాంత్ ప్రస్తుతం సెకండ్ లీడ్‌గా స్పెషల్‌ రోల్స్‌లో పలు సినిమాలు చేస్తున్నాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us