
మరొకరు తన స్టైలిష్ లుక్స్ తో, కూల్ పర్ఫార్మెన్స్ తో యూత్ లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న చాక్లెట్ బాయ్. ఈ ఇద్దరు దిగ్గజ నటులు ఇప్పుడు ఒకే సినిమాలో భాగం కాబోతున్నారనే వార్త సినీ సర్కిల్స్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. అది కూడా ఒక టాలెంటెడ్ తెలుగు దర్శకుడి నేతృత్వంలో ఈ క్రేజీ ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంటోంది. ఆ స్టార్ హీరో మరెవరో కాదు, ‘కంగువ’తో అందరినీ ఊరించిన సూర్య. తన 44వ సినిమా కోసం ఆయన ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ ను ఎంచుకున్నారు. ఆ సినిమాలో మరో టాలెంటెడ్ హీరో ఎంట్రీ ఇవ్వబోతున్నారట.
‘సార్’ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి, ఇప్పుడు సూర్యతో ఒక భారీ ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాలో మలయాళ సూపర్ స్టార్ దుల్కర్ సల్మాన్ ఒక కీలకమైన అతిథి పాత్రలో మెరవబోతున్నారని తెలుస్తోంది. దుల్కర్ సల్మాన్ కు తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన పాత్ర చిన్నదైనా, కథలో ఎంతో ప్రాముఖ్యత ఉంటుందని ఫిలిం నగర్ టాక్. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ గురించి సోషల్ మీడియాలో రకరకాల చర్చలు మొదలయ్యాయి.
Suriya & Dulquer
సూర్య మరియు దుల్కర్ సల్మాన్ మధ్య మంచి స్నేహబంధం ఉంది. గతంలో కూడా వీరిద్దరూ కలిసి ఒక ప్రాజెక్ట్ చేయబోతున్నారని వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు వెంకీ అట్లూరి సినిమాలో దుల్కర్ గెస్ట్ రోల్ చేయడం దాదాపు ఖాయమైనట్లు కనిపిస్తోంది. ఈ పాత్ర సినిమా మలుపు తిరిగే క్రమంలో వస్తుందని, క్లైమాక్స్ లేదా ఇంటర్వెల్ లో దుల్కర్ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని సమాచారం. ఈ సినిమా పీరియడ్ డ్రామా నేపథ్యంలో ఉండబోతోందని, అందుకే ఈ ఇద్దరు టాలెంటెడ్ నటులను ఒకే చోట చేర్చడం వల్ల సినిమా రేంజ్ మరింత పెరుగుతుందని దర్శకుడు భావిస్తున్నారట.
ఈ క్రేజీ ప్రాజెక్టుకు జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. సూర్య కెరీర్ లోనే ఇది ఒక మైలురాయి లాంటి సినిమా అవుతుందని చిత్ర యూనిట్ నమ్ముతోంది. దుల్కర్ సల్మాన్ ఈ మధ్యే ‘లక్కీ భాస్కర్’ సినిమాతో తెలుగులో మరో హిట్ అందుకున్నారు. ఇప్పుడు సూర్య లాంటి స్టార్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడం వల్ల రెండు భాషల మార్కెట్ కు ఈ సినిమా ప్లస్ కానుంది. ఈ గెస్ట్ రోల్ కి సంబంధించిన అఫీషియల్ కన్ఫర్మేషన్ త్వరలోనే వచ్చే అవకాశం ఉంది.
సూర్య, దుల్కర్ సల్మాన్ కలయిక అంటేనే బాక్సాఫీస్ దగ్గర అద్భుతాలు జరుగుతాయని అభిమానులు ఆశిస్తున్నారు. వెంకీ అట్లూరి తన మార్క్ ఎమోషన్స్ తో ఈ ఇద్దరు హీరోలను ఎలా చూపిస్తారో చూడాలి.