
ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎన్నో రకాల జోనర్స్ లో సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడా లేకుండా కంటెంట్ బాగుంటే సినిమాలు విపరీతంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. థియేటర్స్ లో కొత్త సినిమాలు సందడి చేస్తున్నాయి. థియేటర్స్ లో విడుదలవుతున్న సినిమాలు భారీ హిట్స్ అవుతున్నాయి. పాన్ ఇండియా రేంజ్ లో సినిమాలు విడుదలై ఆడియన్స్ ను ఆకట్టుకుంటున్నాయి. అలాగే ఓటీటీలోనూ సినిమాలు ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. ఇప్పటికీ ఎన్నో రకాల జోనర్స్ లో సినిమాలు ఆడియన్స్ ను మెప్పిస్తున్నాయి. ఇక ఇప్పుడు ఓ థ్రిల్లర్ సినిమా ఓటీటీలో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇటీవలే థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చి అలరిస్తుంది. ఈ సినిమా ఓ ఓ ఢిపరెంట్ జోనర్ మూవీ.. బ్లాక్ కామెడీ థ్రిల్లర్ కంటెంట్ తో తెరకెక్కింది ఈ సినిమా.. ఇంతకూ ఆ సినిమా ఎదో తెలుసా.?
ఆ సినిమా మరోదో కాదు.. బాలకృష్ణ హీరోయిన్ రాధికా ఆప్టే నటించిన సిస్టర్ మిడ్‌నైట్. ఈ సినిమాకు కరణ్ కాందహారి దర్శకత్వం వహించారు. అశోక్ పాఠక్, ఛాయా కదం, స్మితా తాంబే వంటి నటులు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం మే 30, 2025న థియేటర్లలో విడుదలైంది. కేవలం రెండు వారాల్లోనే డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చి ఆశ్చర్యపరిచింది. ఈ సినిమా కథ విషయానికొస్తే.. సినిమా కథ ఉమా (రాధికా ఆప్టే) అనే మహిళ చుట్టూ తిరుగుతుంది. ఆమె పెద్దలు కుదిర్చిన వివాహంతో గోపాల్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని, ముంబైలోని ఒక స్లమ్‌లో కాపురం పెడుతుంది. అయితే, ఈ వివాహం ఉమాకు ఇష్టం లేకపోవడంతో, ఆమె తన భర్తతో సరిగ్గా కలవలేకపోతుంది. గోపాల్ ఒక ఇంట్రోవర్ట్ కావడంతో వారి మధ్య సంబంధం బలపడదు.
ఉమా లోపల ఒక విపరీతమైన కోరికను అణచివేయలేక, దాని గురించి బయటకు చెప్పలేక మానసికంగా, శారీరకంగా అనారోగ్యం పాలవుతుంది. ఒక రోజు ధైర్యం చేసి గోపాల్‌తో సన్నిహితంగా గడుపుతుంది. అయితే మరుసటి రోజు ఉదయం గోపాల్ చనిపోయి ఉంటాడు. ఈ సంఘటన తర్వాత ఉమా జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది. ఆమె ఒంటరి ప్రయాణం ఎలా సాగింది అనేది కథాంశం. రాధికా ఆప్టే ఈ బోల్డ్ పాత్రలో అద్భుతమైన నటనతో సినిమాను ఒంటిచేత్తో నడిపించిందని విమర్శకులు, ప్రేక్షకులు ప్రశంసించారు. ఆమె ఒక స్లమ్ మహిళగా చూపించిన డెప్త్, ఎమోషన్స్ చాలా సహజంగా ఉన్నాయి. సినిమా పాజిటివ్ టాక్‌ను సంపాదించినప్పటికీ, సరైన పబ్లిసిటీ లేకపోవడంతో పెద్దగా ప్రేక్షకులకు చేరలేదనే చెప్పాలి. ఈ సినిమా డార్క్ కామెడీ, థ్రిల్లర్ జానర్‌లను ఇష్టపడే వారికి బాగా నచ్చుతుంది. బోల్డ్ కంటెంట్ కారణంగా ఫ్యామిలీ ఆడియన్స్‌కు దూరంగా ఉండటం మంచిది. ఇప్పుడీ చిత్రం అమెజాన్ ప్రైమ్, గూగుల్ ప్లేలో హిందీలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఇండియాలో ఈ సినిమా అందుబాటులో లేదు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.