
సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్ గురించి ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. మహేష్ బాబు సినిమా వస్తుందంటే చాలు అభిమానులకు పండగే.. ఆయన సినిమాల రిలీజ్ లను జాతర జరుపుకుంటారు ఫ్యాన్స్. ఇంతవరకు పాన్ ఇండియా సినిమా చేయనప్పటికీ మహేష్ కూడా దేశవ్యాప్తంగానే కాదు ఇతర దేశాల్లోనూ ఫ్యాన్స్ ఉన్నారు. ముఖ్యంగా అమ్మాయిల్లో మహేష్ ఫాలోయింగ్ మాములుగా ఉండదు. తమకు కాబోయేవాడు మహేష్ లా హ్యాండ్సమ్ గా ఉండాలని కోరుకుంటుంటారు. ఇక మహేష్ సినిమాల విషయానికొస్తే .. ప్రస్తుతం సూపర్ స్టార్ రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ జెట్ స్పీడ్ తో జరుగుతుంది. ఈ సినిమాలో మహేష్ బాబు నయా లుక్ లో కనిపించనున్నారు. అయితే మహేష్ బాబు నటించిన సినిమాలు ప్రేక్షకులను ప్రత్యేకంగా ఆకట్టుకునేవి. సినిమాల రిజల్ట్ ఎలా ఉన్న కొన్ని మాత్రం ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటాయి.
మహేష్ నటించిన సినిమాల్లో ఖలేజా సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఆ సినిమా థియేటర్స్ లో పెద్దగా ఆడలేదు. ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చింది. కానీ ఈ సినిమా చాలా మందికి ఫేవరెట్ మూవీ. అసలు ఖలేజా సినిమా ఎందుకు ఆడలేదు కూడా చాలా మందికి అర్ధం కాలేదు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో డైలాగ్స్, మహేష్ బాబు యాటిట్యూడ్ ఆడియన్స్ ను ఆకట్టుకుంటాయి. అలాగే ఈ సినిమాకు మణిశర్మ అందించిన సంగీతం కూడా అలరిస్తుంది. మహేష్ కు జోడీగా ఈ సినిమాలో అనుష్క నటించింది. ఇక ఇప్పుడు ఈ సినిమా మరోసారి థియేటర్స్ లో సందడి చేయనుంది. మే 30న ఖలేజా సినిమా 4 కే వర్షన్ విడుదల కానుంది. ఇప్పటికే ఫ్యాన్స్ ఈ సినిమా థియేటర్స్ లో మరోసారి చూడటానికి రెడీ అయ్యారు.
కాగా ఖలేజా సినిమాలో కొంత భాగం రాజస్థాన్ లో జరుగుతుంది. టాక్సీ డ్రైవర్ అయినా హీరో.. తన కారుపై పడి చనిపోయిన దిలావర్ సింగ్ అనే వ్యక్తి కుటుంబాన్ని కలవడానికి రాజస్థాన్ వెళ్తాడు. అయితే ఈ సీన్స్ అన్ని ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. కొంతమంది ఈ సినిమాలో దిలావర్ సింగ్ భార్యగా నటించిన నటి గురించి ఆరా తీస్తున్నారు. సోషల్ మీడియాలో ఆమెకు సంబందించిన వీడియోలు, ఆమె ఎవరో చెప్పండ్రా అంటూ చేసిన ఫన్నీ వీడియోలు వైరల్ గా మారాయి. ఆమె కోసం కుర్రాళ్ళు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో గాలించారు. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.? ఆమె పేరు దివ్య మేరీ సిరియాక్. ఆమె గతంలో పలు సినిమాల్లో నటించింది. ప్రస్తుతం ఆమె సినిమాలకు దూరంగా ఉంటుంది. కానీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ భామ.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.