ప్రియుడితో కలిసి చిందులేసిన క్రేజీ బ్యూటీ.. కుళ్ళుకుంటున్న కుర్రాళ్ళు..

|

Dec 20, 2024 | 3:12 PM

సోషల్ మీడియా ద్వారా చాలా మంది అందాల భామలు సినిమాల్లో అవకాశాలు అందుకుంటున్నారు. అలాగే కొంతమంది సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు. నెట్టింట పాపులర్ అయినా తర్వాత సినిమాల్లో అవకాశాలు అందుకున్న భామల్లో ఈ అమ్మడు కూడా ఒకరు.

ప్రియుడితో కలిసి చిందులేసిన క్రేజీ బ్యూటీ.. కుళ్ళుకుంటున్న కుర్రాళ్ళు..
Actress
Follow us on

హీరోయిన్స్ సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ యమా యాక్టివ్ గా ఉంటూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో చాలా మంది హీరోయిన్స్ సినిమాలతో కంటే సోషల్ మీడియాతోనే ఎక్కువ పాపులర్ అవుతున్నారు. అలాగే ఇంకొంతమంది సోషల్ మీడియా ద్వారా సినిమాల్లో అవకాశాలు అందుకుంటున్నారు. అలా సోషల్ మీడియా ద్వారా సినిమాల్లో ఆఫర్స్ అందుకున్న భామల్లో పైన కనిపిస్తున్న బ్యూటీ ఒకరు. అందం అభినయంతో సినిమాల్లో అవకాశాలు అందుకుంటుంది ఈ చిన్నది. సినిమాల కంటే ముందు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో పాపులారిటీ సొంతం చేసుకుంది. చాలా షార్ట్ ఫిలిమ్స్ లో నటించి ఆతర్వాత సినిమాల్లో ఆఫర్ అందుకుంది. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇంతకూ ఆమె ఎవరంటే..

ఇది కూడా చదవండి :అప్పుడు బాడీ షేమింగ్ అవమానాలు.. ఇప్పుడు నోరెళ్ళబెట్టి చూసే సోయగం.. స్టార్ హీరోయిన్స్‌కు గట్టి పోటీ

పై ఫొటోలో ప్రియుడితో కలిసి రొమాంటిక్ గా డాన్స్ చేస్తున్న నటి మరెవరో కాదు సోనియా సింగ్. ఈ బ్యూటీకి చాలా మంది ఫ్యాన్ ఫాలోవర్స్ ఉన్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడు పలు షార్ట్ ఫిలిమ్స్ ద్వారా పాపులర్ అయ్యింది. తనతో పాటు షార్ట్ ఫిలిమ్స్ చేసిన పవన్ సిద్ధుతో సోనియా రిలేషన్ లో ఉంది. ఈ ఇద్దరూ కలిస్ పలు షార్ట్ ఫిలిమ్స్ లో నటించారు. ఈ ఇద్దరూ ప్రేమలో తేలిపోవడమే కాదు.. సోషల్ మీడియాలోనూ కలిసి రీల్స్, ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి :Venu Swamy: నన్ను గెలికినప్పటి నుంచే సినిమా ఇండస్ట్రీలో కలకలం మొదలయ్యింది.. ఇంకా జరుగుతాయి

కాగా సోనియా సింగ్ సోషల్ మీడియా క్రేజ్ తో సినిమాల్లో ఛాన్స్ లు అందుకుంటుంది. మొన్నామధ్య సాయి ధరమ్ తేజ్ నటించిన విరూపాక్ష సినిమాలో కీలక పాత్రలో నటించింది. ఈ మూవీలో పల్లెటూరి అమ్మాయిగా కనిపించి ఆకట్టుకుంది సోనియా. ఇక ఇప్పుడు ఈ బ్యూటీ మెల్లమెల్లగా గ్లామర్ డోస్ పెంచుతుంది. నెట్టింట తన అందాలతో కుర్రాళ్లను కవ్విస్తుంది. ఈ అమ్మడు హీరోయిన్ గా చేస్తే చాలా మంది ముద్దుగుమ్మలు గట్టి పోటీ ఇస్తుందని నెటిజన్స్ అంటున్నారు. ఇటీవలే తన ప్రియుడు పవన్ సిద్దూతో కలిసి ఓ వీడియో చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.