
దళపతి విజయ్ పేరు ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలోనే కాదు ఇండియా వైడ్ గా మారుమ్రోగుతుంది. టాప్ హీరోగా రాణించిన విజయ్ ఇప్పుడు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు ఇచ్చారు. ఎంట్రీ ఇవ్వడమే కాదు తొలి ఎన్నికల్లోనే రికార్డ్ స్థాయిలో విజయం సాధించి సెన్సేషన్ క్రియేట్ చేశారు విజయ్. ఏకంగా 108స్థానాల్లో విజయం సాధించి తమిళ నాడులో టీవీకే జెండా పాతారు విజయ్. ఇక విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారా లేదా అన్నదానిపై ఇప్పటికీ క్లారిటీ రాలేదు. త్వరలోనే విజయ్ సీఎం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీవీకే పార్టీకి మద్దతు లభిస్తే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి విజయ్ సీఎం అవుతారు. దీని పై తమిళ నాట ఇంకా సందిగ్ధం నెలకొంది.. విజయ్ ఎన్నికల్లో విజయం సాధించడంతో సినీ సెలబ్రెటీలు ఆయనను విష్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ లు షేర్ చేస్తున్నారు.
ఈ క్రమంలోనే కొందరు సినీ సెలబ్రెటీలు విజయ్ తో ఉన్న ఫోటోలను పంచుకుంటున్నారు. తాజాగా విజయ్ ఓల్డ్ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఫొటోలో విజయ్‌తో ఉన్న హీరో ఎవరో గుర్తుపట్టారా.? తమిళ్ సినిమాలతో పాటు తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు ఆయన. విజయ్‌తో ఉన్న నటుడు ఎవరో కాదు ఆయన తమిళ్ నటుడు జై.
జై జర్నీ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. ఈ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులో డైరెక్ట్ గా సినిమా చేయకపోయినా జై ఇక్కడ మంచి మార్కెట్ క్రియేట్ చేసుకున్నాడు. జై నటించిన రాజారాణి సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. కాగా జై విజయ్ తో ఉన్న ఓల్డ్ ఫోటో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. ఎలక్షన్స్ ప్రచారంలోనూ జై కూడా పాల్గొని విజయ్ కు మద్దతు తెలిపాడు.