అమ్మబాబోయ్..! ఈ హీరోయిన్ గుర్తుందా .? ఇప్పుడు చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే..

వరుణ్ తేజ్ హీరోగా నటించిన తొలి సినిమా ముకుంద సినిమాలో సత్యదేవ్ చిన్న పాత్రలో కనిపించాడు. ఆ తర్వాత పూరిజగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన జ్యోతిలక్ష్మీ అనే సినిమాలో ప్రధాన పాత్రలో నటించాడు. అలాగే హీరోగా ఎన్నో ఆకట్టుకునే సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించాడు. ఇక సత్య దేవ్ హీరోగా నటించి మెప్పించిన సినిమాల్లో ఉమామహేశ్వర ఉగ్రరూపస్య అనే సినిమా ఒకటి.

అమ్మబాబోయ్..! ఈ హీరోయిన్ గుర్తుందా .? ఇప్పుడు చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే..
Uma Maheswara Ugra Roopasya
Follow us

|

Updated on: Aug 21, 2024 | 2:50 PM

వర్సటైల్ యాక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు నటుడు సత్య దేవ్. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టి ఆతర్వాత హీరోగా మారాడు. వరుణ్ తేజ్ హీరోగా నటించిన తొలి సినిమా ముకుంద సినిమాలో సత్యదేవ్ చిన్న పాత్రలో కనిపించాడు. ఆ తర్వాత పూరిజగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన జ్యోతిలక్ష్మీ అనే సినిమాలో ప్రధాన పాత్రలో నటించాడు. అలాగే హీరోగా ఎన్నో ఆకట్టుకునే సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించాడు. ఇక సత్య దేవ్ హీరోగా నటించి మెప్పించిన సినిమాల్లో ఉమామహేశ్వర ఉగ్రరూపస్య అనే సినిమా ఒకటి. 2020 లో వెంకటేష్ మహా దర్శకత్వంలో వచ్చింది ఈ సినిమా. . ఇది మలయాళంలో ఘనవిజయం సాధించిన మహేశ్‌ ఇంటే ప్రతికారం చిత్రాన్ని తెలుగులోకి ఉమామహేశ్వర ఉగ్రరూపస్యగా తీసుకువచ్చారు.

ఇది కూడా చదవండి : అడిగినంత ఇవ్వలేదని రాజమౌళి సినిమాకు నో చెప్పిన బ్యూటీ.. గోల్డెన్ ఆఫర్ మిస్ చేసుకుంది

ఈ సినిమాలో సత్య దేవ్ తన నటనతో ఆకట్టుకున్నాడు.. కేరాఫ్‌ కంచరపాలెంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వెంకటేశ్‌ మహా దర్శకత్వం వహించిన రెండో చిత్రం ఇది. ఈ సినిమా కోవిడ్ సమయం కావడంతో థియేటర్స్‌లో రిలీజ్ అవ్వలేదు. ఓటీటీలో ఈ సినిమా స్ట్రీమింగ్ అయ్యింది. ఈ సినిమాలో చాలా మంది కొత్తవారు నటించారు. ఈ సినిమాలో ఫోటోగ్రాఫర్ ఉమా మహేశ్వర రావుగా నటించాడు సత్యదేవ్. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన ముద్దుగుమ్మ గుర్తుందా.?

ఇది కూడా చదవండి : అప్పుడు రవితేజ లవర్‌గా.. ఇప్పుడు మిస్టర్ బచ్చన్‌లో ఇలా..! ఈ హీరోయిన్ ఎంత మారిపోయింది..!!

ఆమె పేరు రూప కొడువాయూర్.. చక్కని రూపంతో పాటు నటనతోను ఆకట్టుకుంటోంది ఈ ముద్దుగుమ్మ. ఈ అమ్మడు తెలుగు అమ్మాయే. ఇప్పటికే తెలుగులో రెండు చిత్రాల్లో నటించిన ఈ భామ ప్రస్తుతం ఓ తమిళ చిత్రంలో నటిస్తోంది. మొన్నీమద్యే  మిస్టర్ ప్రెగ్నెంట్.. బిగ్ బాస్ సోహెల్ హీరోగా వచ్చిన ఈ చిత్రం మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది. ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటోంది. అందమైన ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ చిన్నది ఇప్పుడు ఎలా ఉందో మీరే చూడండి.

ఇది కూడా చదవండి : Rakul Preet Singh: ఊహించని పరిణామాలు నా జీవితంలో జరుగుతున్నాయి.. ఎమోషనల్ అయిన రకుల్

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..