Kolkata Doctor Case: పొంతన లేని సమాధానాలు.. కోల్‌కతా ఘటనలో మాజీ ప్రిన్సిపల్‌‌కు పాలీగ్రాఫ్‌ పరీక్ష..!

కోల్‌కతాలో డాక్టర్‌ పై అత్యాచారం, హత్య కేసులో సుప్రీంకోర్టు త్రీవంగా స్పందించడంతో దర్యాప్తు సంస్థ సీబీఐ వేగాన్ని పెంచింది. ఈ కేసులో కీలకంగా మారిన RG కర్‌ మెడికల్‌ కాలేజీ మాజీ ప్రిన్సిపల్‌ సందీప్‌ ఘోష్‌కు పాలీగ్రాఫ్‌ పరీక్ష నిర్వహించాలని సీబీఐ భావిస్తోంది.

Kolkata Doctor Case: పొంతన లేని సమాధానాలు.. కోల్‌కతా ఘటనలో మాజీ ప్రిన్సిపల్‌‌కు పాలీగ్రాఫ్‌ పరీక్ష..!
Kolkata Doctor Case
Follow us

|

Updated on: Aug 21, 2024 | 2:38 PM

కోల్‌కతాలో డాక్టర్‌ పై అత్యాచారం, హత్య కేసులో సుప్రీంకోర్టు త్రీవంగా స్పందించడంతో దర్యాప్తు సంస్థ సీబీఐ వేగాన్ని పెంచింది. ఈ కేసులో కీలకంగా మారిన RG కర్‌ మెడికల్‌ కాలేజీ మాజీ ప్రిన్సిపల్‌ సందీప్‌ ఘోష్‌కు పాలీగ్రాఫ్‌ పరీక్ష నిర్వహించాలని సీబీఐ భావిస్తోంది. గడిచిన కొన్ని రోజులుగా సందీప్‌ ఘోష్‌ను సీబీఐ ప్రశ్నిస్తోంది. కొన్ని ప్రశ్నలకు ఆయన చెప్పిన సమాధానాలు పొంతన లేకపోవడంతో పాలీగ్రాఫ్‌ పరీక్ష నిర్వహించాలనే సీబీఐ అనుకుంటోంది. దీనికి సంబంధించి ఒకట్రెండు రోజుల్లో సీబీఐ అధికారులు కోర్టు అనుమతి కోరే అవకాశం ఉంది.

మరో వైపు కోల్‌కతాలో డాక్టర్ల నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. కోల్‌కతాలో డాక్టర్లు భారీ ప్రదర్శన నిర్వహించారు. బాధిత వైద్యురాలికి న్యాయం జరగాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. వందల సంఖ్యలో డాక్టర్లు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. సుప్రీంకోర్టుకు సీబీఐ, బెంగాల్‌ సర్కారు నివేదిక సమర్పించే వరకు నిరసనలు కొనసాగించాలని బెంగాల్‌ జూనియర్‌ డాక్టర్లు నిర్ణయించారు. ఆ నివేదికల సారాంశాన్ని బట్టి తదుపరి కార్యాచరణపై ఆలోచన చేస్తామని వెల్లడించారు. కాగా.. డాక్టర్ల నిరసనకు మాజీ క్రికెటర్‌ సౌరవ్‌ గంగూలీ సంఘీభావం తెలిపారు. డాక్టర్ల నిరసన ప్రదర్శనలో గంగూలీ, ఆయన భార్య డోనా కూడా పాల్గొనే అవకాశం ఉంది.

మరో వైపు, డాక్టర్ పై అత్యాచారం, హత్య ఈ కేసులో ఇప్పటికే అరెస్టైన నిందితుడు సంజయ్‌ రాయ్‌కి సీబీఐ అధికారులు పాలీగ్రాఫ్‌ పరీక్షలు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి అనుమతి కోరుతూ సీబీఐ స్థానిక కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అనుమతి రాగానే పరీక్షలు నిర్వహించనున్నారు.

మరో వైపు కోల్‌కతా RG కర్‌ ఆస్పత్రిలో భద్రత చేపట్టేందుకు CISF సిద్ధమవుతోంది. ఆస్పత్రిని CISF ఐజీ సందర్శించారు. భద్రతా ఏర్పాట్ల గురించి మీడియా ఆయనను ప్రశ్నించినప్పటికీ.. ఆయన సమాధానం చెప్పేందుకు నిరాకరించారు.

మరో వైపు బెంగాల్‌ సర్కారు తీరును తప్పుబడుతూ కోల్‌కతాలో బీజేపీ నిరసన ప్రదర్శన నిర్వహించింది. బెంగాల్‌లోని మమతా బెనర్జీ ప్రభుత్వంపై, ఇక్కడి పోలీసులపై న్యాయస్థానాలకు నమ్మకం లేదని బెంగాల్‌ బీజేపీ నేత సుకాంత మజుందార్‌ ఆరోపించారు. RG కర్‌తోనే అత్యాచార ఘటనలు ఆగడం లేదని రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో మహిళలపై దాడులు జరుగుతూనే ఉన్నాయని తెలిపారు. ఈ పరిస్థితుల్లో మమతా బెనర్జీ రాజీనామా చేయడం ఉత్తమమని సుకాంత మజుందార్‌ సూచించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..