పిల్లల్లో ప్రొటీన్‌ లోపాన్ని భర్తీ చేసే ఆహారాలు ఇవే

21 August 2024

TV9 Telugu

TV9 Telugu

పిల్లలు ఆరోగ్యంగా ఎదగాలంటే ప్రొటీన్‌ చాలా అవసరం. ఎముకల పుష్టికి తోడ్పడే పోషకాలలో క్యాల్షియం, విటమిన్‌ డితోపాటు ప్రొటీన్‌ కూడా ముఖ్యమే

TV9 Telugu

పిల్లల ఎదుగుదలకు ప్రతిరోజూ శరీరానికి తగినంత ప్రోటీన్ అందిచడం చాలా ముఖ్యం. పిల్లలకు తగినంత ప్రొటీన్లు అందకపోతే శరీరంలో రకరకాల సమస్యలు కనిపిస్తాయి

TV9 Telugu

అందుకు ప్రతిరోజూ చేపలు, మాంసం తినడం కుదరదు. బదులుగా సమతుల్య ఆహారం తీసుకోవచ్చు. కూరగాయల ప్రోటీన్ ఫుడ్ అన్ని పోషకాలను అందించడంలో తోడ్పడతాయి

TV9 Telugu

రోజువారీ ఆహారంలో ప్రోటీన్ అవసరాన్ని తీర్చడానికి పప్పులను చేర్చడం చాలా ముఖ్యం. ఇందులో విటమిన్లు, మినరల్స్‌ కూడా ఉంటాయి. రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది

TV9 Telugu

రోజూ ఒక ఉడికించిన గుడ్డు తినడం మంచిది. గుడ్లలో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇందులో కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, సెలీనియం, విటమిన్ A, విటమిన్ B, విటమిన్ B12, విటమిన్ B5, విటమిన్ D, జింక్ కూడా ఉంటాయి

TV9 Telugu

శరీరానికి కావలసిన ప్రొటీన్ అవసరాన్ని భర్తీ చేసేందుకు చేపలను తప్పనిసరిగా తినాలి. అలాగే చికెన్ కూడా ప్రోటీన్‌కు మంచి మూలం. వీటిని అధిక నూనె, మసాలాలు వేసి వండితే మాత్రం కాలేయం దెబ్బతింటుంది

TV9 Telugu

బదులుగా వెజిటబుల్ చికెన్ తినడం చాలా మంచిది. రెడ్ మీట్ లో ప్రొటీన్లు ఉన్నప్పటికీ నెలకు 2-3 సార్లు కంటే ఎక్కువ తినకపోవడమే మంచిది. చాలా మంది పిల్లలు మాంసం తినడానికి ఇష్టపడరు

TV9 Telugu

ఇలాంటి వారిలో ప్రోటీన్ లోపాన్ని పూరించడానికి పాలు, సోయాబీన్స్ తినిపించవచ్చు. ప్రోబయోటిక్స్ కోసం పెరుగు తనిపించాలి. పాలు, పెరుగు, మజ్జిగ వంటి వాటిల్లో క్యాల్షియం, ప్రొటీన్‌ సమృద్ధిగా ఉంటాయి