350కు పైగా సినిమాలు..! ముగ్గురు భార్యలు.. ఏడుగురు పిల్లలు.. విలనిజానికి కొత్త అర్ధం చెప్పిన నటుడు

తెలుగు సినిమా చరిత్రలో తిరుగులేని నటులు చాలా మంది ఉన్నారు వారి ఈ నటుడు ఒకరు. విలన్ గా ఎన్నో అద్భుతమైన సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. నాటకరంగం నుంచి కెరీర్ మొదలుపెట్టి విలన్ గా సినిమాల్లో నటించి మెప్పించారు .

350కు పైగా సినిమాలు..! ముగ్గురు భార్యలు.. ఏడుగురు పిల్లలు.. విలనిజానికి కొత్త అర్ధం చెప్పిన నటుడు
Tollywood Actor

Updated on: Jul 09, 2026 | 4:51 PM

విలనిజానికి గ్లామర్ నేర్పిన నటుడు నాగభూషణం. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో విలన్ గా నటించి ప్రేక్షకులను మెప్పించారు నాగభూషణం, తెలుగు చిత్రసీమలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. రంగస్థలం నుంచి వెండితెరపై ప్రతినాయక పాత్రలకు కొత్త నిర్వచనం ఇచ్చిన ఘనత ఆయనది. విలన్ డైలాగ్‌లకు కూడా ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టించిన బహుముఖ ప్రజ్ఞాశాలి. రక్త కన్నీరు నాటకంతో వేల ప్రదర్శనలు ఇచ్చి సినీ రంగంలో తనదైన ముద్ర వేసుకున్నారు. తెలుగు చిత్రసీమలో ప్రతినాయక పాత్రలంటే కేవలం క్రూరత్వం మాత్రమే కాదు, అందులో హాస్యం, సెటైర్ కూడా పండించవచ్చని నిరూపించిన మహానటుడు నాగభూషణం.నాగభూషణం రెండేళ్ల వయసులో మేనమామ ఊరైన అపమాంచాపురం వెళ్లి, తండ్రి పెట్టిన వీధి బడిలో విద్యాభ్యాసం చేశారు. హైస్కూల్ ఖర్చులకు ఇబ్బంది పడి చిన్నచిన్న పనులు చేస్తూ చదువు కొనసాగించారు. ఇంటర్ పూర్తి చేసిన తర్వాత పైచదువులకు ఆర్థిక ఇబ్బందులు అడ్డుతగిలాయి. 1942లో తండ్రి మరణించిన రోజే రైల్వే శాఖ ఉద్యోగానికి మద్రాసు నుంచి కాల్ లెటర్ రావడంతో, తండ్రి కర్మదినాన్ని వదిలి ఇంటర్వ్యూకి హాజరయ్యారు.

ఇది కూడా చదవండి : Actress Sudha: ఆ స్టార్ హీరో నాకు దేవుడితో సమానం.. రెండుసార్లు నా ప్రాణాలు కాపాడాడు.

రైల్వే ఉద్యోగంలో తోటి ఉద్యోగులు వేసే నాటకాలు చూసి నాగభూషణానికి నటనపై ఆసక్తి కలిగింది. 1951లో వచ్చిన పల్లెటూరు చిత్రంతో నాగభూషణం సినీరంగ ప్రవేశం చేశారు. ఆ తర్వాత పెంకి పెళ్ళాంలో తాగుబోతుగా, అమర సందేశంలో విలన్‌గా పలు చిత్రాల్లో నటించారు. 1956లో బాల్య స్నేహితుడు ఘంటసాల కృష్ణమూర్తి నిర్మించిన ఏది నిజం.? చిత్రంలో హీరోగా నటించి రాష్ట్రపతి బహుమతిని అందుకున్నారు. అయితే హీరోగా ఆయనకు ఆశించిన గుర్తింపు రాలేదు. మాయాబజార్ వంటి చిత్రాల్లో చిన్న పాత్రలు చేస్తూనే నాటక ప్రదర్శనలతో బిజీగా గడిపారు. 1961లో శభాష్ రాజా చిత్రంతో ఆయన దశ తిరిగింది. దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు తీసిన మంచి మనసులు చిత్రంలో ఎం.ఆర్. రాధా పోషించిన పాత్రను ఆయనకు ఇచ్చారు. ఆ తర్వాత వచ్చిన మూగమనసులు పరిశ్రమలో ఆయనకు ప్రత్యేక స్థానాన్ని కల్పించింది. ఉమ్మడి కుటుంబం (1967)తో ఆయన మరింత బిజీ అయ్యారు.

ఇది కూడా చదవండి : Prabhas: ప్రభాస్‌కు ఇష్టమైన హీరోయిన్ ఎవరో తెలుసా.? ఆమె నా క్రష్ అంటున్న రెబల్ స్టార్

ఇవి కూడా చదవండి

ఎన్టీఆర్ తో సన్నిహితంగా మెలిగిన నాగభూషణం ఆయన ప్రోత్సాహంతో ఒకే కుటుంబం చిత్రాన్ని నిర్మించారు. కథానాయకుడు చిత్రంలో ఆయన విలన్ డైలాగ్‌లకు ప్రేక్షకులు చప్పట్లు కొట్టడం అప్పటినుంచే ప్రారంభమైంది. తర్వాత హీరో కృష్ణ సన్నిహితుడిగా మెలిగి మోసగాళ్లకు మోసగాడు, నేనంటే నేనే చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషించారు. నాటకాల రాయుడు, మహమ్మద్ బిన్ తుగ్లక్ చిత్రాల్లో హీరోగా నటించారు. అయితే ఆయన నిర్మించిన ప్రజానాయకుడు, భాగస్తులు వంటి చిత్రాలు అంతగా విజయం సాధించలేదు. 1974లో ముత్యాల ముగ్గుతో రావు గోపాలరావు వంటి కొత్త విలన్ రాకతో నాగభూషణం నటన మోనాటనీకి చేరిందనే వాదన ఉంది, ఇది ఆయన కెరీర్ పై ప్రభావం చూపింది. వ్యక్తిగత జీవితంలో 1941లో సుబ్బారత్నంతో ఆయన వివాహం జరిగింది. ఆమె అకాల మరణం తర్వాత శశిరేఖను వివాహం చేసుకున్నారు, వారికి ముగ్గురు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు. తొలి నుంచి చివరి వరకు ఉన్న సహనటి సీతను నాగభూషణం 1956లో మూడో వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. కూతురు భువనేశ్వరిని ఛాయాగ్రాహకుడు మీర్ కి ఇచ్చి మతాంతర వివాహం చేశారు. 1994లో విడుదలైన నెంబర్ వన్ ఆయన చివరి చిత్రం. 1995 మే 5న నాగభూషణం తుది శ్వాస విడిచారు.

ఇది కూడా చదవండి : Nagarjuna: నాగార్జునకు విలన్‌గా ఆ అందాల భామ.. కింగ్ 100వ సినిమా కోసం మాస్టర్ ప్లాన్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us