9వ తరగతిలోనే డేటింగ్.. ఫ్రెండ్స్‌తోనే ఎఫైర్స్.. కట్ చేస్తే డిప్రషన్‌లోకి.. ఇప్పుడు స్టార్ హీరోయిన్

సినిమా ఓ రంగుల ప్రపంచం. ఈ సినీ పరిశ్రమలో నటీనటులుగా తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలని కోటి కలలో అడుగుపెడుతుంటారు. ముఖ్యంగా కొత్త హీరోయిన్స్ చాలా మంది వస్తుంటారు. ఒకటి రెండు చిత్రాలతో చాలా ఫేమస్ అయిపోతుంటారు. అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటారు.

9వ తరగతిలోనే డేటింగ్.. ఫ్రెండ్స్‌తోనే ఎఫైర్స్.. కట్ చేస్తే డిప్రషన్‌లోకి.. ఇప్పుడు స్టార్ హీరోయిన్
Actress

Updated on: Jun 01, 2025 | 4:49 PM

సినిమా ఇండస్ట్రీలో చాలా మంది స్టార్ డమ్ కోసం ప్రయత్నిస్తుంటారు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ దూసుకుపోతున్నారు. నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటిస్తూ స్టార్ డమ్ సొంతం చేసుకుంటుంటారు. కానీ కొంతమంది హీరోయిన్స్ మాత్రం చేతులారా కెరీర్ ను నాశనం చేసుకుంటుంటారు. ఇక ఇండస్ట్రీలో లవ్ లు, బ్రేకప్స్ అనేవి చాలా కామన్ గా కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం మాట్లాడుకునే హీరోయిన్ కూడా అంతే చేతులారా కెరీర్ ను నాశనం చేసుకుంది. చిన్న వయసులోనే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. కానీ 15 ఏళ్ల వయసులోనే డిప్రషన్ లోకి వెళ్ళింది. ఇంతకూ ఆ హీరోయిన్ ఎవరో తెలుసా.?  చిన్న వయసులోనే డేటింగ్, ఆపై టీనేజ్ లోనే వల్గర్ కామెంట్స్ ఎదుర్కొంది. దాంతో ఆమె డిప్రషన్ లోకి వెళ్ళింది..

ఆమె ఎవరో కాదు సుర్వీన్ చావ్లా. ఈ ముద్దుగుమ్మ హిందీ, పంజాబీ సినిమాల్లో నటించి మెప్పించింది. సుర్వీన్ తన సినీ కెరీర్ మొదలుపెట్టింది. “కహీం తో హోగా” (2003) అనే టెలివిజన్ సీరియల్‌తో మొదలుపెట్టింది. ఆ తర్వాత “కసౌటీ జిందగీ కీ” (2004)లో చారు పాత్రలో కనిపించింది. ఆమె 2008లో “ఏక్ ఖిలాడీ ఏక్ హసీనా” అనే రియాలిటీ డాన్స్ షోలో పాల్గొంది. అలాగే ఈ ముద్దుగుమ్మ 2011లో పంజాబీ చిత్రం “ధర్తి”తో సినీ రంగంలోకి అడుగుపెట్టింది. హిందీలో “హేట్ స్టోరీ 2” (2014), “అగ్లీ” (2013), “పర్చ్డ్” (2015), మరియు “24” (2016) వంటి చిత్రాలలో నటించి గుర్తింపు పొందింది. ఆమె “సేక్రేడ్ గేమ్స్” (2018) వంటి వెబ్ సిరీస్‌లలో కూడా నటించింది.

సుర్వీన్ చావ్లా సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ అనుభవాల గురించి బహిరంగంగా మాట్లాడింది. ఈ ముద్దుగుమ్మ ఒక ఇంటర్వ్యూలో, దక్షిణ భారత చిత్ర పరిశ్రమలో ఒక జాతీయ అవార్డు గెలుచుకున్న దర్శకుడు తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని, అలాంటి అనుభవాలు 20 సార్లు ఎదురైనట్లు వెల్లడించింది. అయినప్పటికీ, ఆమె ఎప్పుడూ ధైర్యంగా వ్యవహరించి, అటువంటి పరిస్థితులకు లొంగలేదని చెప్పింది. అలాగే తాను చిన్న వయసులో ఉండగానే డిప్రషన్ లోకి వెళ్ళా అని తెలిపింది. 9వ తరగతిలోనే డేటింగ్ చేసినట్లు చెప్పింది. కానీ ఆ రిలేషన్‌ తనకు చాలా నెగిటివిటీ తెచ్చిపెట్టిందని తెలిపింది. మొదటి బాయ్ ఫ్రెండ్ తో బ్రేకప్ అయిన తర్వాత తన స్నేహితుడితో మరోసారి డేటింగ్ మొదలు పెట్టా అని దాంతో ఎన్నో అవమానాలు ఎదురుకోవాల్సి వచ్చింది. దారుణమైన మాటలతో నన్ను అవమానించారు. దాంతో నేను డిప్రషన్ లోకి వెళ్ళా.. అలాగే ఆ సమయంలో మైగ్రేన్ తో బాధపడేదాన్ని.. ఆతర్వాత దాని నుంచి మెల్లగా బయటపడ్డా అని తెలిపింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.