
టాలీవుడ్ కింగ్ నాగార్జున ఇప్పుడు తన 100వ సినిమా కోసం రెడీ అవుతున్నారు. ఈ సినిమా యూనిక్ గా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే కింగ్ నాగార్జునకు ఇండియా వైడ్ గా ఉన్న ఫ్యాన్స్ గురించి, క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హీరోగా కెరీర్ మొదలు పెట్టిన నాగ్.. తన కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేశారు. ఎంతో మంది దర్శకులతో కలిసి పని చేశారు. నాగ్ కు ముఖ్యంగా అమ్మయిల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. సినిమాల్లో రాణిస్తున్న నాగార్జున బిగ్ బాస్ గేమ్ షోకు హోస్ట్ గా చేస్తూ మెప్పిస్తున్నారు. మన్మధుడు నాగార్జున ఎంతో మంది హీరోయిన్స్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. సీనియర్ హీరోయిన్స్ దగ్గర నుంచి ఇప్పటి జనరేషన్ యంగ్ హీరోయిన్స్ తో కూడా నాగ్ నటించారు.
సీనియర్ హీరోయిన్స్ రమ్యకృష్ణ, సౌందర్య, రోజా, మీనా, శ్రియా, ఆర్తి అగర్వాల్, అనుష్క, స్నేహ, నయనతార వంటి స్టార్స్ అందరూ నాగార్జునతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నవారే అలాగే రకుల్, ఆషిక రంగనాథ్ లాంటి యంగ్ హీరోయిన్స్ తో కూడా రొమాన్స్ చేశారు నాగార్జున. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో సూపర్ హిట్స్ అందుకుని టాప్ హీరోయిన్లుగా కొనసాగుతున్న ముద్దుగుమ్మలందరూ నాగార్జునతో నటించినవారే. కానీ హీరోయిన్ మాత్రం నాగార్జునతో ఒక్క సినిమా కూడా చేయలేదు. అలాగని ఆమె చిన్న హీరోయిన్ కాదు.. ఇండస్ట్రీని ఊపేసిన భామ ఆమె.. స్టార్ హీరోలందరితో కలిసి నటించింది. కానీ నాగార్జునతో ఒక్క సినిమా కూడా చేయలేదు. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా..? నాగార్జునతో ఒక్క సినిమా కూడా చేయని టాప్ హీరోయిన్ మరెవరో కాదు.. ఒకప్పటి అందాల రాశి రంభ.
16 ఏళ్లకే కథానాయికగా సినీరంగంలోకి అడుగుపెట్టిన ఈ అమ్మడు.. తక్కువ సమయంలోనే గుర్తింపు తెచ్చుకుంది. రాజేంద్ర ప్రసాద్ ఆ ఒక్కటీ అడక్కు సినిమాతో టాలీవుడ్ కు హీరోయిన్ గా పరిచయం అయ్యింది. మెగాస్టార్ చిరంజీవి, వెంకటేశ్, బాలకృష్ణ, రజినీకాంత్, జేడీ చక్రవర్తి వంటి స్టార్ హీరోలతో అనేక చిత్రాల్లో నటించింది. అప్పట్లో విపరీతమైన క్రేజ్ ఉన్న రంభ.. నాగార్జునతో మాత్రం ఒక్క సినిమా చేయలేదు. అయితే నాగార్జునతో సినిమా ఆఫర్స్ వచ్చినప్పటికీ రంభ రిజెక్ట్ చేసిందని తెలుస్తుంది. ఎందుకంటే.. అప్పట్లో నాగ్ నటించిన సూపర్ హిట్ చిత్రాల్లో హలో బ్రదర్ ఒకటి. డైరెక్టర్ ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నాగ్ డ్యూయల్ రోల్ చేశారు. ఇందులో రమ్యకృష్ణ, సౌందర్య హీరోయిన్లుగా నటించారు. అయితే ఈ చిత్రంలో రమ్యకృష్ణ కంటే ముందుగా రంభను ఎంపిక చేసుకున్నారట డైరెక్టర్. రంభను కన్ఫార్మ్ చేసి డైట్స్ కూడా బుక్ చేశారట. కానీ నాగార్జున రమ్యకృష్మ కావలాని పట్టుబట్టడంతో రంభను తొలగించి ఆమెను తీసుకున్నారట. దీంతో ఆ తర్వాత నాగ్ పక్కన నటించే ఛాన్స్ వచ్చినప్పటికీ రంభ రిజెక్ట్ చేసిందట. కానీ డైరెక్టర్ ఈవీవీ కోరిక మేరకు హలో బ్రదర్ సినిమాలో ఓ పాటలో మెరిసింది రంభ. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న రంభ త్వరలోనే రీ ఎంట్రీ ఇవ్వనుందని తెలుస్తుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.