ఈ క్రేజీ బ్యూటీని గుర్తుపట్టారా.? తెలుగులో ఒకే ఒక్క సినిమా చేసింది.. కట్ చేస్తే బిగ్ బాస్‌తో పాపులర్

ఈ మధ్యకాలంలో వస్తున్న హీరోయిన్ కొన్ని సినిమాలకే పరిమితం అవుతున్నారు. గట్టిగా చేస్తే పది సినిమాలతో ఫెడ్ అవుట్ అవుతున్నారు. మరికొంతమంది మరీ దారుణంగా ఒకటి రెండు సినిమాలు చేసి ఇండస్ట్రీకి బై బై చెప్పేస్తున్నారు. కానీ కొంతమంది హీరోయిన్స్ మాత్రం వరుసగా అవకాశాలు అందుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్నారు.

ఈ క్రేజీ బ్యూటీని గుర్తుపట్టారా.? తెలుగులో ఒకే ఒక్క సినిమా చేసింది.. కట్ చేస్తే బిగ్ బాస్‌తో పాపులర్
Tollywood Actress

Updated on: Nov 16, 2025 | 12:10 PM

తెలుగు సినీ పరిశ్రమలో ఒక్క సినిమా చేసి ఫేమస్ అయిన నటీనటులు చాలా మంది ఉన్నారు. తెలుగులో ఒక్క సినిమాలో కీలకపాత్రలో నటించి మెప్పించారు. కానీ అనుహ్యంగా సినిమాలకు దూరమవుతుంటారు. బుల్లితెరపై ఓ వెలుగు వెలిగి ఇప్పుడు వెండితెరపై బిజీ ఆర్టిస్టులుగా మారినవారు ఉన్నారు. అలాంటి తారలలో పైన ఫోటోలో కనిపిస్తున్న బ్యూటీ ఒకరు. మొదట్లో సీరియల్స్ చేసిన ఈ భామా.. ఇప్పుడు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంటుంది. కానీ కథానాయికగా ఈ భామను వెండితెరకు పరిచయం చేసింది మాత్రం తెలుగు సినిమానే. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక సినిమా చేసి ఆ తర్వాత బాలీవుడ్ షిఫ్ట్ అయ్యింది. హిందీలో పలు సినిమాల్లో నటించి అలాగే ఇప్పుడు సీరియల్స్ చేస్తుంది. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా ?

తన పేరు మధురిమ తూలి. తెలుగులో ఒక సినిమా చేసింది. కానీ అంతగా ఫేమ్ మాత్రం అందుకోలేకపోయింది. కెరీర్ తొలినాళ్లలోనే హిందీ పరిశ్రమలోకి షిఫ్ట్ అయ్యింది. 2008లో హోమం సినిమా ద్వారా కథానాయికగా తెలుగు తెరకు పరిచయమైంది. మధురిమ హీరోయిన్‏గా నటించిన మొదటి సినిమా ఇదే. ఇందులో విలక్షణ నటులు జగపతి బాబు, జేడీ చక్రవర్తి ప్రధాన పాత్రలు పోషించారు. అప్పట్లో ఈ మూవీ అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమా తర్వాత అదే ఏడాది తమిళంలో రెండు సినిమాల్లో నటించింది. తర్వాత బాలీవుడ్ నుంచి పిలుపు రావడంతో అక్కడికి వెళ్లిపోయి వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్లిపోయింది.

చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న సమయంలోనే అటు ఇంగ్లీష్ చిత్రాల్లోనూ ఆఫర్స్ అందుకుంది. హిందీలో సినిమాలు, సీరియల్స్ అంటూ తెగ సందడి చేసింది. అలాగే బుల్లితెరపై అతిపెద్ద రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ 13లో పాల్గొంది. ఇప్పుడు టెహ్రాన్ చిత్రంలో నటిస్తుంది. అలాగే సీరియల్స్ కూడా కంటిన్యూ చేస్తుంది. హోమం తర్వాత తెలుగులో మరో సినిమా చేయలేదు. అలాగే సీరియల్స్ కూడా చేయలేదు. ప్రస్తుతం మధురిమ వయసు 38. గతంలో తన స్నేహితుడిని ప్రేమించిన మధురిమ.. మనస్పర్థల కారణంగా విడిపోయారు. ఫస్ట్ బ్రేకప్ తర్వాత ప్రేమ, పెళ్లి బంధాలకు దూరంగా ఉంటుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us