
సినిమా ఇండస్ట్రీలో జరిగే పెళ్లిళ్లు, విడాకులు ఎప్పుడూ హాట్ టాపిక్ గానే ఉంటాయి. కొంతమంది చిన్న వయసులోనే పెళ్లి చేసుకుంటుంటే మరికొంతమంది పెళ్లి అనే దానికి దూరంగా ఉంటున్నారు. మరికొందరు రెండు మూడు పెళ్లిళ్లు కూడా చేసుకుంటున్నారు. ఇటీవలే అమీర్ ఖాన్ 60 ఏళ్లు దాటిన తర్వాత ముచ్చటగా మూడో పెళ్లి చేసుకున్నాడు. అలాగే ఇండస్ట్రీలో చాలా మంది ఏజ్ తో సంబంధం లేకుండా పెళ్లి చేసుకుంటున్నారు. కాగా తమకన్నా వయసులో దాదాపు 20ఏళ్లు పెద్ద వాళ్లను కూడా పెళ్లాడిన హీరోయిన్స్ ఉన్నారు. ఆ లిస్ట్ ఈ ముద్దుగుమ్మ ఒకరు. కేవలం 19ఏళ్లకే పెళ్లి చేసుకొని అభిమానులకు ఊహించని షాక్ ఇచ్చింది అది కూడా తనకన్నా 20ఏళ్ల పెద్ద హీరోని ఆమె ఎవరో తెలుసా.?
ఆమె మరెవరో కాదు తమిళ ముద్దుగుమ్మ నజ్రియా నజీమ్. ఈ అమ్మడు తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే.. కొన్ని డబ్బింగ్ సినిమాలతో పాటు ఓ స్ట్రయిట్ తెలుగు సినిమాలోనూ నటించింది. కాగా నజ్రియా నజీమ్ నేరమ్ సినిమాతో తమిళంలోకి అడుగుపెట్టింది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత రాజా రాణి, నైయాండి, వైయై మూడి పేసవుం, తిరుమణం ఈ నిక్కా వంటి చిత్రాలతో జనాలను ఆకట్టుకుంది. రాజా రాణి సినిమా తెలుగులోనూ మంచి విజయాన్ని అందుకుంది. ఆ సినిమాతో తెలుగు కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్ గా మారిపోయింది.
తెలుగులో నేచురల్ స్టార్ నాని నటించిన అంటే సుందరానికి చిత్రంలో నటించింది ఈ మూవీ ,మంచి విజయాన్ని అందుకుంది. అయితే కెరీర్ మంచి ఫాంలో ఉండగానే మలయాళీ నటుడు ఫహద్ ఫాసిల్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అప్పుడు ఆమె వయసు కేవలం 19 సంవత్సరాలు మాత్రమే. ఈ ఇద్దరూ కలిసి బెంగుళూరు డేస్ సినిమాలో నటించారు. పెళ్లి సమయానికి ఫహద్ ఫాసిల్ వయసు 31 ఇద్దరి మధ్య 20 ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉంది. ఈ జంట ఆతర్వాత ఎవరి సినిమాలతో వారు బిజీగా గడుపుతున్నారు. ఆ మధ్య విడిపోతున్నట్టు వార్త వచ్చాయి కానీ ఆతర్వాత దాని మీద ఎలాంటి టాక్ వినిపించలేదు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి