Guess the Actress: ఇటీవల ఎక్కడ చూసిన ఆమె పేరే.. వివాదంతో వైరల్ అయ్యింది.. ఇంతకు ఈ ఫొటోలో ఉంది ఎవరో తెలుసా..?
ఇంతకు పైన కనిపిస్తోన్న ఫొటోలో ఉన్న చిన్నది ఎవరో కనిపెట్టారా..? సడన్ గా చూస్తే కనిపెట్టలేక పోవచ్చు కానీ పట్టి పట్టి చూస్తే ఈమేనా అని అనుకుంటారు.

ఇటీవల ఒక అమ్మడి పేరు సోషల్ మీడియాలో అటు వార్తల్లో తెగ హల్ చల్ చేస్తోంది. పై ఫొటోలో కనిపిస్తోన్న చిన్నారి ఆమె. మొన్నటి వరకు అంతగా వినిపించని ఆమె పేరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆమె హీరోయిన్ కాదు గురూ కానీ ఫెమస్ అయ్యింది. ఇంతకు పైన కనిపిస్తోన్న ఫొటోలో ఉన్న చిన్నది ఎవరో కనిపెట్టారా..? సడన్ గా చూస్తే కనిపెట్టలేక పోవచ్చు కానీ పట్టి పట్టి చూస్తే ఈమేనా అని అనుకుంటారు. ఇంతకు ఆమె ఎవరయ్యి ఉంటారు.? మరీ అంత ఆలోచించకండి ఆమె ఎవరంటే..
పై ఫొటోలో కనిపిస్తోన్న చిన్నారి మరెవరో కాదు. ఇటీవల కాలంలో వార్తల్లో బాగా వినిపించిన క్యారెక్టర్ ఆర్టిస్ట్ పవిత్ర లోకేష్.. కాదు కాదు పవిత్ర నరేశ్. పవిత్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పవిత్ర క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అమ్మ, వదిన, అక్క పాత్రల్లో నటించి మెప్పించాడు పవిత్ర.
ఇక ఇటీవల సీనియర్ హీరో నరేష్ తో రిలేషన్ తో హాట్ టాపిక్ గా మారారు. నరేష్ ను ఆమె రెండో పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యారు. కాగా నరేష్ కు ఇది నాలుగో పెళ్లి కావడం విశేషం. ఈ ఇద్దరు న్యూ ఈయర్ సందర్భంగా పెళ్లి చేసుకోబోతున్నాం అని అనౌన్స్ చేసి షాక్ ఇచ్చారు. అదేవిధంగా ఈ ఇద్దరు పెళ్లి చేసుకుంటున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు నరేష్. దాంతో వీరి పెళ్లి అయిపోయిందని అంతా అనుకుంటున్నారు. అయితే వీరి పెళ్లి నిజంగానే అయ్యిందా..? లేక ఏదైనా సినిమా కోసం షూట్ చేశారా అన్నది తెలియడం లేదు. అలాగే ఈ ఇద్దరు దుబాయ్ లో చక్కర్లు కొడుతున్నారు.
Pavitra Lokesh




