పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. గతేడాది ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ భారీగానే వసూళ్లు రాబట్టింది. ఇందులో పవర్ స్టార్ జోడీగా నిత్యా మీనన్ నటించగా.. రానా దగ్గుబాటి, సంయుక్త మీనన్ కీలకపాత్రలలో కనిపించారు. మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పనుమ్ కోషియమ్ సినిమాకు రీమేక్‌గా ఈ మూవీ వచ్చింది. మొదటిసారి పవన్, రానా కలిసిన నటించిన ఈ సినిమాకు అభిమానుల నుంచి ఊహించని రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా రానా పాత్రకు మంచి పేరు వచ్చింది. హీరోకు ఏమాత్రం తగ్గకుండా పొగరుతోనే కాకుండా.. ఫ్యామిలీ పరంగా ఎమోషన్స్ చూపిస్తూ నటనతో మరోసారి మెప్పించాడు రానా.
అయితే ఈ పాత్ర కోసం ముందుగా అనుకున్న హీరో రానా కాదట. ప్రస్తుతం ఫిల్మ్ సర్కిల్లో వినిపిస్తున్న టాక్ ప్రకారం ఈ పాత్రను ఇద్దరు స్టార్ హీరోస్ మిస్ చేసుకున్నారట. ఇంతకీ వారిద్దరు ఎవరో తెలుసుకుందామా. అందులో ఒకరు మ్యాచో స్టార్ గోపిచంద్. అప్పటికే మరో సినిమాతో గోపిచంద్ బిజీగా ఉండడంతో ఈ సినిమాను వదిలేయాల్సి వచ్చిందట.
ఇక ఆ తర్వాత మాస్ మాహారాజా రవితేజను సంప్రదించాగా… డేట్స్ అడ్జట్స్ కావంటూ వదిలేసారంట. అయితే రవితేజను స్వయంగా పవన్ అడగ్గా.. నటించాలని ఉన్నా.. వేరే సినిమాలకు డేట్స్ కేటాయించానని.. సున్నితంగా తిరస్కరించారట. దీంతో ఈ ఛాన్స్ రానా వద్దకు చేరింది. భీమ్లా నాయక్ చిత్రంలో పవన్, రానా నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ చిత్రానికి సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించగా.. త్రివిక్రమ్ డైలాగ్స్ అందించారు.