
కొన్ని సినిమాలు ప్రేక్షకుల మనస్సులో చిరస్థాయిగా నిలిచిపోతుంటాయి. ఎన్ని సార్లు చూసిన బోరు కొట్టని సినిమాలు చాలానే ఉన్నాయి. కొన్ని సినిమాలు ఓటీటీలో ఇప్పటికీ ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. అయితే ఓ సినిమా దాదాపు 10ఏళ్లుగా ఇండస్ట్రీని షేక్ చేస్తుంది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని అందుకుంది. రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ కూడా రాబట్టింది. ఇండస్ట్రీలోనే బిగెస్ట్ హిట్ గా నిలిచింది ఆ సినిమా. అయితే థియేటర్స్ లో మాత్రమే కాదు ఓటీటీలోనూ దుమ్మురేపుతోంది ఆ మూవీ. ఇప్పటికీ ఓటీటీలో ఈ సినిమా తెగ ఎంజాయ్ చేస్తున్నారు ఆడియన్స్. కేవలం 80 కోట్లతో నిర్మించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.623 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. ఎమోషన్స్, కామెడీ, యాక్షన్ ఇలా అన్ని అంశాలతో కలగలిపిన ఈ సినిమా అన్ని వయసుల సినీప్రియులను కట్టిపడేసింది.
కొన్నేళ్ల క్రితం థియేటర్లలో ఆధిపత్యం చెలాయించిన ఈ సినిమా.. 2016లో సంచనల విజయం అందుకుంది. అంతేకాదు.. ఆ సినిమాలో నటించిన స్టార్ హీరోహీరోయిన్ల కెరీర్ మలుపు తిప్పింది. ఆ సినిమా మరేదో కాదు బాలీవుడ్ లో విడుదలైన సుల్తాన్. 2016 జూలై 6న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన సుల్తాన్ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. అలీ అబ్బాస్ దర్శకత్వం వహించిన ఈ స్పోర్ట్స్ డ్రామాలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్,అనుష్క శర్మ హీరోహీరోయిన్లుగా నటించారు.
సుల్తాన్ అలీ ఖాన్ అనే రెజ్లర్.. తన కొడుకు మరణంతో రెజ్లింగ్ వదిలి సామాన్య జీవితం గడుపుతుంటాడు. కానీ కొన్నాళ్లకు అతడు తన కెరీర్ తిరిగి ప్రారంభించి మళ్లీ తన గౌరవాన్ని పొందాలనుకుంటాడు ఇదే సినిమా కథ. ఈ క్రమంలో ఆయన ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి. వాటిని హీరో ఎలా ఎదుర్కున్నాడు అనేది సినిమాలో చూడాలి. దాదాపు 80 కోట్లతో నిర్మించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.623.33 కోట్లకు పైగా వసూళ్లు రాబ్టటింది. అంతేకాకుండా.. ఈ సినిమా కేవలం భారతదేశంలోనే రూ.421 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఇందులో మొత్తం 9 పాటలు ఉండగా.. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలోనూ ట్రెండింగ్ అవుతుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి