
ప్రస్తుతం బాలీవుడ్ మూవీ ధరంధర్ 2 సినిమా దుమ్మురేపుతుంది. ఉగాది కానుకగా రిలీజైన ధురందర్ 2 మొదటి షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. సుమారు 4 గంటల నిడివి ఉన్నప్పటికీ ఇంటెన్స్ డ్రామాతో మూవీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ధురంధర్ 2 సినిమా ఇప్పటికే అన్ని రికార్డ్స్ ను బ్రేక్ చేసింది. హిందీతో పాటు తెలుగు ఇతర భాషల్లోనూ ఈ సినిమాకు రికార్డు కలెక్షన్లు వస్తున్నాయి. ఆదిత్య ధర్ తెరకెక్కించిన ధురందర్ 2లో రణ్ వీర్ సింగ్ పాత్ర హైలెట్ గా నిలిచింది. అలాగే ఆర్. మాధవన్, సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్, సారా అర్జున్, రాకేష్ బేడీ, గౌరవ్ జెరా, డ్యానిష్ పండోర్, సౌమ్యా టాండన్, అశ్విన్ ధర్.. ఇలా చాలా మంది స్టార్స్ ఈ మూవీలో వివిధ పాత్రల్లో మెరిశారు. ఇక ఈ సినిమా ఇప్పటికే రూ. 1000క్లొట్ల మార్క్ ను దాటేసింది. కాగా అంతకు ముందు విడుదలైన ధురంధర్ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీలో దూసుకుపోతుంది.
ఇదిలా ఉంటే ధురంధర్ సినిమాను ఓ చిన్న సినిమా బీట్ చేసింది. ఇది నిజంగా ఊహించని ట్విస్ట్.. ఎలాంటి అంచనాలు లేకండా వచ్చిన ఓ చిన్న సినిమా.. అది కూడా థియేటర్స్ లో కాకుండా ఓటీటీలో విడుదలైన ఓ సినిమా ధురంధర్ 2 సినిమాను వెనక్కి నెట్టేసింది. ఆ సినిమా మరేదో కాదు యంగ్ బ్యూటీ ప్రియాంక మోహన్ నటించిన మేడ్ ఇన్ కొరియా. మార్చి 12న నేరుగా ఈ సినిమా ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లోకి అందుబాటులోకి వచ్చేసింది.
కాగా ఈ సినిమా ఓటీటీలోకి వచ్చిన మొదటి వారంలోనే నంబర్ ప్లేస్‌లో ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. అంతే కాదు ఇప్పటికీ అంటే రెండు వారాలు పూర్తి అయినా కూడా ఈ సినిమాకు క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. నెట్‌ఫ్లిక్స్‌లో నానా-ఇంగ్లీష్ కేటగిరీలో దురంధర్ చిత్రాలను వెనక్కి నెట్టి మొదటిస్థానంలో కొనసాగుతోంది ఈ చిన్న సినిమా. ఈ విషయాన్ని డైరెక్టర్ కార్తీక్ సోషల్ మీడియాలో పంచుకున్నారు.
Really happy to share that #madeinkorea is trending globally NO 1 for the 2nd week in the Non-English Movies category on Netflix 🌍
For the first time, a South Indian film has reached this kind of global scale and to sustain it into the second week makes it even more special ❤️… pic.twitter.com/3LNAdVkxpM
— Ra.Karthik (@Rakarthik_dir) March 25, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.