ఇదెక్కడి సినిమారా మావ..!! పెట్టింది రూ.5కోట్లు వచ్చింది రూ. 180కోట్లు.. చిన్న సినిమా పెద్ద విజయం

చిన్న సినిమాలు రీసెంట్ డేస్ లో థియేటర్స్ ను షేక్ చేస్తున్నాయి. చిన్న బడ్జెట్ తెరకెక్కించి భారీ విజయాలను అందుకుంటున్నారు. కొత్త దర్శకులు, కొత్త కొత్త నటీనటులు కంటెంట్ ఉన్న సినిమాలను ఎంచుకుంటూ హిట్స్ కొడుతున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఓ చిన్న సినిమా ఇండస్ట్రీని షేక్ చేస్తుంది.

ఇదెక్కడి సినిమారా మావ..!! పెట్టింది రూ.5కోట్లు వచ్చింది రూ. 180కోట్లు.. చిన్న సినిమా పెద్ద విజయం
Movie

Updated on: Apr 15, 2026 | 5:27 PM

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తుంది. ఒకే సినిమాను ఐదు ఆరు భాషల్లో విడుదల చేస్తున్నారు. పెద్ద సినిమాలను ఏకంగా 10, 14 భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే చిన్న సినిమాలు కూడా పుంజుకుంటున్నాయి. కంటెంట్ ను నమ్ముకొని రంగంలోకి దిగుతున్న చిన్న సినిమాలు రికార్డ్స్ బ్రేక్ చేస్తున్నాయి. కొత్త హీరోలు, కొత్త దర్శకులు తెరకెక్కిస్తున్న చిన్న బడ్జెట్ సినిమాలు నిర్మాతల పాలిట వరంగా మారుతున్నాయి. చిన్న సినిమాలతో బోలెడన్ని లాభాలు అందుకున్న నిర్మాతలు చాలా మంది ఉన్నారు. ఇక చిన్న సినిమాగా వచ్చిన ఓ మూవీ ఇప్పుడు బాక్సాఫీస్ ను షేక్ చేసింది. అంతే కాదు నయా రికార్డ్ ను క్రియేట్ చేసి ఆడియన్స్ చేత శబాష్ అనిపించుకుంటుంది. కేవలం రూ. 5కోట్లతో తెరకెక్కించిన ఆ సినిమా ఇప్పుడు రూ. 180కోట్లకు పైగా కలెక్ట్ చేసి అందరూ నోరెళ్లబెట్టాలా చేసింది. ఆ సినిమా ఏదంటే..

ఆ స్టార్ హీరోకు అక్కగా అడిగారు.. చేయనని తేల్చి చెప్పా.. అసలు విషయం చెప్పిన ఆమని

రీసెంట్ డేస్ లో మలయాళం నుంచి వచ్చిన సినిమాలు తెగ ఆకట్టుకుంటున్నాయి. ఓటీటీల్లో మలయాళ సినిమాలకు మంచి క్రేజ్ ఉంది. ఎన్నో మలయాళ సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యి ఓటీటీల్లో అందుబాటులో ఉన్నాయి. o ఓటీటీల్లోనే కాదు థియేటర్స్ లోనూ మలయాళ సినిమాలు దుమ్మురేపుతున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల వచ్చిన ఓ సినిమా కలెక్షన్స్ పరంగా కుమ్మేసింది. ఆ సినిమానే ‘వాళా: బయోపిక్‌ ఆఫ్‌ ఎ బిలియన్‌ బాయ్స్‌’. ఈ సినిమా కథ నలుగురు విద్యార్థుల జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఉంటుంది.

అతను నా నెంబర్ బ్లాక్ చేశాడు.. జబర్దస్త్ నుంచి వచ్చేయడానికి కారణం వాళ్లే

గతంలో ఈ సినిమా మొదటి భాగం విడుదలైంది. ఆ సినిమాలో నలుగురు విద్యార్థులు డ్రగ్స్ కేసులో ఇరుక్కోవడం చూపించారు. దానికి కొనసాగింపుగా తెరకెక్కిన ఈ సినిమాకూడా ఇంచుమించు అలానే ఉంటుంది. నలుగురు విద్యార్థుల  చుట్టూ సినిమా రన్ అవుతుంది. మొదటి భాగం రూ. 4కోట్లతో తెరకెక్కిస్తే లాంగ్ రన్ లో రూ. 38కోట్లు రాబట్టింది. ఇక ఇప్పుడు రెండో భాగం రూ. 5కోట్లతో తెరకెక్కిస్తే ఏకంగా రూ. 180కోట్లకు పైగా వసూల్ చేసింది. మలయాళంలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమాను తెలుగులో విడుదల చేయనున్నారు. ఏప్రిల్‌ 24న ఈ మూవీ తెలుగు వర్షన్ ను విడుదల చేయనున్నారు. ఈ సినిమాకు ఆనంద మేనన్ దర్శకత్వం వహించారు.

ఇవి కూడా చదవండి

కుర్రాడు భలే చేస్తున్నాడు..! ఎన్టీఆర్‌కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా ఎదో తెలుసా.?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us