
బుల్లితెరపై ఆమెకు సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. పద్దతిగా, సంప్రదాయ పద్దతిలో కనిపిస్తూ తల్లి పాత్రలో అద్భుతమైన నటనతో కట్టిపడేసింది. సౌమ్యంగా కనిపిస్తూనే.. అద్భుతమైన యాక్టింగ్‌లో సీరియల్ ప్రియులను ఆకట్టుకుంది. చీరకట్టులో.. అచ్చమైన తెలుగింటి ఆడపడుచుగా కనిపించిన ఈ బ్యూటీ.. సోషల్ మీడియాలో మాత్రం గ్లామర్ ఫోజులతో గత్తరలేపుతోంది. ప్రస్తుతం సీరియల్స్ గుడ్ బై చెప్పేసి సినిమాల్లో అదృష్టం పరీక్షిస్తుంది. ఇప్పుడు హీరోయిన్గా వెండితెరపై సత్తా చాటేందుకు రెడీ అయ్యింది. తాజాగా ఈ అమ్మడు గ్లామరస్ లుక్స్ చూసి ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్. పైన ఫోటోను చూశారు కదా.. అందులో కనిపిస్తున్న బ్యూటీ బుల్లితెరపై చాలా ఫేమస్. అంతేకాదు.. తెలుగు సీరియల్ ప్రియులకు ఇష్టమైన నటి. ఇంతకీ ఆమె మరెవరో కాదు.. గుప్పెడంత మనసు ఫేమ్ జగతి మేడమ్ అలియాస్ జ్యోతిరాయ్. ఇప్పుడు కథానాయికగా రాణిస్తుంది.
జ్యోతిరాయ్.. తెలుగు బుల్లితెర ప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అవసరంలేని పేరు. తెలుగులో టాప్ టీఆర్పీతో దూసుకుపోయిన గుప్పడెంత మనసు సీరియల్లో జగతి మేడమ్ పాత్రలో కనిపించింది. కొడుకు ప్రేమ కోసం తల్లడిల్లే తల్లిగా.. స్టూడెంట్ భవిష్యత్తు కోసం పోరాడే లెక్చరర్ పాత్రలో అద్భుతమైన పాత్రలో కట్టిపడేసింది. ఈ సీరియల్లో కాటన్ చీరకట్టులో ఎంతో పద్దతిగా కనిపించి సహజ నటనతో మెప్పించింది. జగతి మేడమ్ పాత్రలో కనిపించిన జ్యోతిరాయ్.. ఆ తర్వాత మాత్రం సీరియల్ నుంచి తప్పుకుంది. కట్ చేస్తే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ అయ్యింది. బుల్లితెరపై చీరకట్టులో కనిపించిన ఈ అమ్మడు.. నెట్టింట మాత్రం గ్లామరస్ ఫోటోషూట్లతో అరాచకం సృష్టించింది.
సోషల్ మీడియాలో జ్యోతిరాయ్ ఫోటోస్ చూసి ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్. ఇన్నాళ్లు పద్దతిగా కనిపించిన ఈ బ్యూటీ.. ఇప్పుడు నెట్టింట మాత్రమే అందాలతో రచ్చ చేస్తుంది. ప్రస్తుతం ఆమె కిల్లర్ అనే సినిమాలో నటిస్తుంది. ఇటీవల విడుదలైన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో జ్యోతిరాయ్ పవర్ ఫుల్ యాక్టింగ్ తో అదరగొట్టేసింది. త్వరలోనే వరుస సినిమాలతో వెండితెరపై సందడి చేసేందుకు రెడీ అయ్యింది జ్యోతిరాయ్.
ఇవి కూడా చదవండి :
Mirchi Movie: ఈ హీరోయిన్ ఇంత మారిపోయిందేంటి ?.. మిర్చి మూవీ బ్యూటీ ఫ్యామిలీని చూశారా.. ?
Tollywood: సీనియర్ హీరోలతో నటించేందుకు నాకు ఎలాంటి సమస్య లేదు.. హీరోయిన్ ఓపెన్ కామెంట్స్..