Dude Movie: గోల్డెన్ ఛాన్స్ మిస్.. 100 కోట్ల ‘డ్యూడ్’ సినిమాను రిజెక్ట్ చేసిన టాలీవుడ్ హీరో ఎవరో తెలుసా?

దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన డ్యూడ్ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. తమిళంతో పాటు తెలుగులోనూ భారీ కలెక్షన్లు సాధించింది. హీరో ప్రదీప్ రంగనాథన్ కు హ్యాట్రిక్ హిట్స్ ఇచ్చింది. 100 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన డ్యూడ్ మూవీ గురించి ఇప్పుడు ఒక ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది.

Dude Movie: గోల్డెన్ ఛాన్స్ మిస్.. 100 కోట్ల డ్యూడ్ సినిమాను రిజెక్ట్ చేసిన టాలీవుడ్ హీరో ఎవరో తెలుసా?
Dude Movie

Updated on: Oct 29, 2025 | 1:10 PM

కోలీవుడ్ హీరో ప్రదీప్ రంగనాథన్ నటించిన తాజా చిత్రం డ్యూడ్. ‘లవ్ టుడే’ ‘డ్రాగన్’ వంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత వచ్చిన ఈ మూవీ కూడా సంచలన విజయం సాధించింది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. తమిళంతో పాటు తెలుగులోనూ రికార్డు వసూళ్లు సాధించిన డ్యూడ్ సినిమా కలెక్షన్లు ఇప్పటికే 100 కోట్లను దాటేశాయి. కీర్తిశ్వరన్ అనే కొత్త దర్శకుడు తెరకెక్కించిన ఈ యూత్ ఫుల్ లవ్ స్టోరీలో మలయాళం సెన్సేషన్ మమితా బైజు హీరోయిన్ గా నటించింది. డిజే టిల్లు బ్యూటీ నేహా శెట్టి మరో కీలక పాత్రలో మెరిసింది. అలాగే ఆర్ శరత్ కుమార్, రోహిణీ, ఐశ్వర్య శర్మ, వినోదిని వైద్యనాథన్, హ్రిదూ హిరోన్, సత్య, బీసెంట్ రవి తదతరులు ప్రధాన పాత్రలు పోషించారు. సాయి అభ్యంకర్ సంగీత దర్శకుడిగా వ్యవహరించారు. తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాలను నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్ డ్యూడ్ సినిమాను రూపొందించడం విశేషం. అయితే ఈ సినిమా గురించి లేటెస్ట్ గా ఒక ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. అదేంటంటే.. డ్యూడ్ సినిమాకు హీరోగా మొదట ప్రదీప్ రంగనాథన్ ను అనుకోలేదట. టాలీవుడ్ హీరో, అక్కినేని నాగచైతన్యను తీసుకోవాలని అనుకున్నారట.

దర్శకుడు కీర్తిశ్వరన్‌ కూడా ఈ సినిమా కథను నాగ చైతన్యకు వినిపించారట. చైతూకు కూడా ఈ కథ తెగ నచ్చేసిందట. అయితే ఇలాంటి సినిమాల తన కెరీర్ లో ఉన్నాయని, పైగా తండేల్ తర్వాత ఒక పెద్ద సినిమా చేయాలని బలంగా ఫిక్స్ అయ్యాడట. దీనికి తోడు అప్పటికే విరూపాక్ష డైరెక్టర్ కార్తీక్ తో ఓ సినిమాను కమిట్ అయి ఉండడంతో డ్యూడ్ సినిమాను చేయలేనని చెప్పేశాడట. దీంతో డైరెక్టర్ వెంటనే ప్రదీప్ రంగనాథన్ ను సంప్రదించడం, అతను ఓకే చెప్పడంతో డ్యూడ్ సినిమా పట్టాలెక్కిందట. ఒకవేళ ఈ మూవీ గనక నాగచైతన్య చేసి ఉంటే కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ పడేదని అక్కినేని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం విరూపాక్ష డైరెక్టర్ కార్తీక్ తో ఓ మైథలాజికల్ థ్రిల్లర్ సినిమా చేస్తున్నాడు నాగ చైతన్య. NC 24 (వర్కింగ్ టైటిల్) పేరుతో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ రానున్నాయి.

ఇవి కూడా చదవండి

మరికొన్ని రోజుల్లో ఓటీటీలోకి డ్యూడ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.