
ఇటీవల కాలంలో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన సినిమాల గురించి చెప్పక్కర్లేదు. స్టార్ హీరోహీరోయిన్స్ లేకపోయినా.. భారీ బడ్జెట్ సినిమాలు కాకపోయినా ఊహించని కలెక్షన్స్ రాబడుతున్నాయి. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సినిమా మాత్రం రూ.50 కోట్లతో నిర్మిస్తే.. ఏకంగా రూ.224 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇప్పుడు థియేటర్లలో మంచి రెస్పాన్స్ అందుకుంటున్న ఈ సినిమా ఓటీటీలోకి మాత్రం ఆలస్యంగా వస్తుంది. అదే తుదరమ్ సినిమా. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన ఈ సినిమా ఇప్పుడు అడియన్స్ హృదయాలను ఏలేస్తుంది. ఈ చిత్రం ఏప్రిల్ 25న థియేటర్లలో విడుదలై రూ. 224 కోట్ల భారీ వసూళ్లను సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సినిమా ఇప్పటికీ రద్దీగా ఉండే థియేటర్లలో ప్రదర్శితమవుతోంది.
అందుకే ఈ సినిమాను ఓటీటీలో విడుదలకు నిరాకరించారు. మరోవారం రోజుల తర్వాత ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ చేయనున్నారు. ‘తుదరమ్’ సినిమాను జియో సినిమాస్‌లో మే 23న విడుదల చేయాల్సి ఉంది. కేరళలోని చాలా మంది థియేటర్ యజమానులు ఆ సినిమా ఓటీటీ విడుదలను వాయిదా వేయాలని కోరారు. ఎందుకంటే ఇప్పటికీ ప్రతిరోజూ నాలుగు హౌస్‌ఫుల్ షోలు ప్రదర్శిస్తున్నారు.
తుదరమ్ సినిమా ఇప్పుడు థియేటర్లలో దూసుకుపోతుంది. ఇందులో మోహన్ లాల్ జోడిగా శోభన నటించారు. చాలా కాలం తర్వాత వీరిద్దరి కాంబోలో వచ్చిన సినిమా కావడంతో ఈ చిత్రాన్ని చూసేందుకు జనాలు క్యూ కట్టాయి. 90లలో ఈ జోడి అనేక సూపర్ హిట్స్ అందుకున్నారు. అప్పట్లో ఈ జోడికి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉండేది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను రూ.60 కోట్లకు జియో సినిమా కొనుగోలు చేసింది. ఇక థియేటర్లలలో ఈ మూవీ విజయవంతంగా రన్ కావడంతో ఓటీటీ విడుదల వాయిదా పడింది.
ఇవి కూడా చదవండి :
Damarukam Movie: ఢమరుకం మూవీ విలన్ భార్య తెలుగులో తోపు హీరోయిన్.. ఇంతకీ ఆమె ఎవరంటే..