అబ్బో.. ఈ స్టార్ హీరో రూటే సపరేటు..! మొదటి భార్య 12ఏళ్లు పెద్దది.. రెండో భార్య 10ఏళ్లు చిన్నది..

స్టార్ హీరోలు చాలా మంది వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. కొంతమంది సోలో హీరోగానే కాదు మల్టీ స్టారర్ సినిమాలు చేయడానికి కూడా వెనకాడటంలేదు. పెద్ద హీరోలు, చిన్న హీరోలు అని తేడా లేకుండా అందరూ మల్టీస్టారర్ సినిమాలు చేసి మెప్పిస్తున్నారు .

అబ్బో.. ఈ స్టార్ హీరో రూటే సపరేటు..! మొదటి భార్య 12ఏళ్లు పెద్దది.. రెండో భార్య 10ఏళ్లు చిన్నది..
Hero

Updated on: May 17, 2026 | 8:33 AM

భారత చలనచిత్ర సీమలో తన నటనతో ప్రత్యేకమైన ముద్ర వేసిన నటుడు ఆయన. అంతే కాదు భారీ ఆస్తిపాస్తులు ఉన్న హీరో.. రాజవంశానికి చెందిన హీరో ఆయన. ఆయన ఎవరో కాదు సైఫ్ అలీ ఖాన్. హర్యానా రాష్ట్రంలోని పటౌడీ రాజవంశానికి చెందిన పదిహేనవ నవాబ్‌గా, మాజీ క్రికెట్ కెప్టెన్ మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ, ప్రముఖ నటి షర్మిలా ఠాగూర్ల కొడుకు సైఫ్. కేవలం తల్లిదండ్రుల నుంచి వచ్చిన వారసత్వంతోనే కాకుండా, తన నటనతో బాలీవుడ్‌లో స్థిరపడ్డారు. అనేక విభిన్న పాత్రల్లో నటించి మల్టీస్టారర్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారు. సైఫ్ తన కెరీర్‌లో ఏడు ఫిలింఫేర్ అవార్డులు, ఒక జాతీయ అవార్డును గెలుచుకున్నారు. 2010లో భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. సైఫ్ అలీ ఖాన్ 1970 ఆగస్టు 16న న్యూఢిల్లీలో జన్మించారు. ఆయనకు సబా అలీ ఖాన్, సోహా అలీ ఖాన్ అనే ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు. సైఫ్ తాతయ్య ఇఫ్తికర్ అలీ ఖాన్ పటౌడీ భారతదేశానికి స్వాతంత్రం రాకముందే భారత క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించారు. ఆయన తండ్రి మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ కేవలం 21 ఏళ్ల వయసులోనే టీమ్ ఇండియా కెప్టెన్‌గా నియమింపబడి, విజయవంతమైన కెప్టెన్‌గా పేరు తెచ్చుకున్నారు. 1964లో అర్జున అవార్డు, 1967లో పద్మశ్రీ, 2001లో సీకే నాయుడు అవార్డు అందుకున్నారు.

ఇది కూడా చదవండి :RK Roja: ఒక్కహీరో కూడా నాకు లవ్ ప్రపోజ్ చేయలేదు.. కారణం ఏంటో చెప్పిన రోజా

సైఫ్ తల్లి షర్మిలా ఠాగూర్ రెండు జాతీయ అవార్డులు, 2013లో పద్మభూషణ్ అందుకున్నారు. హిమాచల్ ప్రదేశ్‌లోని లారెన్స్ స్కూల్, ఇంగ్లాండ్‌లోని లోకర్స్ పార్క్ స్కూల్, విన్‌చెస్టర్ కాలేజీలలో సైఫ్ విద్యనభ్యసించారు. గ్రాడ్యుయేషన్ తర్వాత ఇండియా వచ్చి, మొదట యాడ్ ఏజెన్సీలో పనిచేశారు. ఆ తర్వాత గ్వాలియర్ సూటింగ్ టీవీ యాడ్‌లో నటించారు. 1991లో బేఖుదీ చిత్రంతో హీరోగా ఎంపికైనప్పటికీ, క్రమశిక్షణ లోపం కారణంగా ఆయన స్థానంలో కమల్ సాధనా నటించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే 21 ఏళ్ల వయసులో తనకంటే 12 ఏళ్లు పెద్దదైన నటి అమృతా సింగ్‌ను ప్రేమించి వివాహం చేసుకున్నారు. వీరికి సారా అలీ ఖాన్, ఇబ్రహీం అలీ ఖాన్ అనే ఇద్దరు పిల్లలు జన్మించారు. 2004లో అభిప్రాయభేదాల కారణంగా అమృతా సింగ్ నుంచి విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత కొంతకాలం ఇటాలియన్ మోడల్ రోసా కెటాలినాతో డేటింగ్ చేశారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : మూడు పెళ్లిళ్లు చేసుకొని తప్పు చేశా.. టైం అంతా వేస్ట్.. ఇప్పుడు బుద్దొచ్చింది

1999లో అజయ్ దేవగన్‌తో కలిసి నటించిన కచ్చే ధాగే, సల్మాన్ ఖాన్‌తో నటించిన హమ్ సాథ్ సాథ్ హై, బీవీ నెంబర్ వన్ విజయాలు సైఫ్ కెరీర్‌కు ఊపందించాయి. వరుసగా హిట్స్ అందుకున్నాడు. ఎక్కువగా మల్టీస్టారర్ సినిమాలతో క్రేజ్ తెచ్చుకున్నాడు సైఫ్. ఆతర్వాత స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ తో డేటింగ్ చేశాడు. ఈ ఇద్దరూ 2012లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక బాబు ఉన్నాడు. కాగా సైఫ్ కంటే కరీనా 10ఏళ్లు చిన్నది. అయితే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమాలో రావణుడిగా నటించి సైఫ్ అలీ ఖాన్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఆతర్వాత దేవర సినిమాలో విలన్ గా నటించి మెప్పించాడు ఈ స్టార్ హీరో.

ఇది కూడా చదవండి :భర్తను దర్శకుడిని చేద్దాం అనుకుంది.. కానీ బెడిసికొట్టింది.. సంపాదించిందంతా పోగొట్టుకొని చివరకు

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us