
ఇటీవల సినీ ప్రముఖుల చిన్ననాటి ఫోటోలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. రోజుకు పదుల సంఖ్యలో హీరోయిన్స్ ఫోటోలు నెట్టింట దర్శనమిస్తున్నాయి. తాజాగా ఓ స్టార్ హీరోయిన్ చిన్ననాటి ఫోటో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

ఓ స్టార్ హీరోయిన్ చిన్ననాటి ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె అలాంటి ఇలాంటి హీరోయిన్ కాదు. పాన్ ఇండియా స్టార్. పెద్ద పెద్ద హీరోలతో సినిమాలు చేసింది, తెలుగు,తమిళ్, హిందీ భాషల్లో సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించింది.

ఆమె మరెవరో కాదు హాట్ బ్యూటీ పూజాహెగ్డే. ఒక లైలాకోసం అనే సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది ఈ చిన్నది. ఆతర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసింది. అల్లు అర్జున్ నటించిన డీజే సినిమాతో భారీ హిట్ అందుకుంది.

డీజే సినిమా తర్వాత ఈ అమ్మడి కెరీర్ స్పీడ్ అందుకుంది. దాంతో వరుసగా బడా హీరోల సినిమాల్లో ఛాన్స్ లు అందుకుంది. అంతే కాదు అప్పటిలో ఈ అమ్మడు నటించిన సినిమాలన్నీ భారీ హిట్ గా నిలిచాయి.

కానీ ఇప్పుడు ఈ చిన్నదానికి కాలం కలిసి రావడం లేదు. ఈ మధ్య పూజా నటించిన సినిమాలన్నీ డిజాస్టర్స్ గా నిలిచాయి. దాంతో సినిమాలకు చిన్న గ్యాప్ ఇచ్చింది. ప్రస్తుతం దళపతి విజయ్ నటిస్తున్న సినిమలో చేస్తుదని. మరి ఈ సినిమాతో పూజా తిరిగి ట్రాక్ లోకి వస్తుందేమో చూడాలి.